వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు ఐక్యరాజసమితి పంపిన ఆహ్వానం చూపించండి?:జివిఎల్

|
Google Oneindia TeluguNews

అమరావతి:చంద్రబాబు అమెరికా పర్యటనను ఉద్దేశించి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఎపి సిఎం చెప్పేదొకటి చేసేదొకటని...అసలు చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం పంపివుంటే చూపించాలని డిమాండ్ చేశారు.

బిజెపి ఎంపి జవిఎల్ వ్యాఖ్యలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎపి సీఎంవో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి పంపిన ఆహ్వానాన్ని మీడియాకు విడుదల చేసింది. ఆ ఇన్విటేషన్ లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తీరుకు చంద్రబాబును ప్రశంసించిన ఐక్యరాజ్యసమితి ఆ విషయమై మాట్లాడేందుకు తమ సమావేశఆనికి రావాలని కోరింది. అయితే ఐక్యరాజ్యసమితి ఆహ్వానంపై బిజెపి ఎంపి జివిఎల్ అనుమానం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అమెరికా పర్యటనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏమన్నారంటే..."చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తున్న ఉద్దేశం ఒకటి...చెప్పేదొకటి...ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో...వాళ్లు పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలి"...అని డిమాండ్ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు పెడుతున్న సమావేశాలకు వెళ్తూ...ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్తున్నట్లు చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Hours after BJP MP GVL calls UN meet fake, AP CMO releases invitation letter

చంద్రబాబు విమానం ఎక్కే లోపే ఐక్యరాజ్యసమితి పంపిన ఇన్విటేషన్‌ను మీడియాకు విడుదల చేయాలని ఎంపి జివిఎల్ డిమాండ్ చేశారు. అలాగే మీడియా కూడా నిజనిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. న్యూయార్క్‌లో సదస్సు పెట్టినంత మాత్రాన...ఐక్యరాజ్యసమితిలో సమావేశం పెట్టినట్లు కాదని వ్యాఖ్యానించారు. ఇది వరల్డ్ ఎకనామిక్ వారు న్యూయార్క్‌లో పెడుతున్న రెండో సమావేశమేనని ఎంపి జివిఎల్ తేల్చేశారు. చంద్రబాబు గొప్పల కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేయొద్దని జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

బిజెపి ఎంపి జివిఎల్ వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించిన ఎపి సిఎంవో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి పంపిన ఆహ్వాన పత్రికను మీడియాకు విడుదల చేసింది. గత నెల 22న యుఎన్ వో ఈ ఆహ్వాన పత్రిక పంపినట్లు ఎపి సిఎంవో వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఎరిక్ సాల్‌హిమ్ పేరుతో ఎపి సీఎంకు ఈ ఆహ్వానం అందినట్లు తెలిపింది. ఎపి సిఎం చంద్రబాబు అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయంపై ప్రశంసలు కురిపించిన యుఎన్వో ఆయన స్ఫూర్తితో చాలామంది ఆ వైపు మళ్లుతారని ఆహ్వాన లేఖలో పేర్కొంది.

ఇదిలావుంటే చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానంపై అనుమానం వ్యక్తం చేసిన బిజెపి ఎంపి జివిఎల్ పై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు.
జివిఎల్ చదువుకున్న అజ్ఞాని అని అభివర్ణించారు. సీఎం చంద్రబాబుకు ఐరాస ఆహ్వానం పంపలేదనడం జీవీఎల్‌ అజ్ఞానానికి నిదర్శనమని...యుఎన్వో లేఖలో ఏముందో అర్ధం కాకుంటే అతని మనవడితో చదివించుకోవాలని బుద్దా వెంకన్న సూచించారు. తెలుగు ప్రజలను అవమానపరిచేలా జీవీఎల్‌ వ్యాఖ్యలు ఉన్నాయని జీవీఎల్‌ తెలుగు గడ్డపై పుట్టి తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌తో ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. గుంట నక్కలు కూడా అసహ్యించుకునేలా బీజేపీ నేతల తీరు ఉందని బుద్దా వెంకన్న దుయ్యబట్టారు.

English summary
Hours after BJP MP GVL Narasimha Rao described AP CM Chandrababu as a “liar” and accused him of making false claims regarding UN invitation to him for delivering a keynote address, the CMO on Tuesday released the invitation letter to the CM from the United Nations Environment Programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X