వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌చారంలో కూడా త‌డ‌బ‌డితే ఎలా లోకేష్ ..? టెక్నాల‌జీ ఎంత డెవల‌ప్ అయ్యిందో తెలుసుగా..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమ‌నిధి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ఇప్పుడు ఎపి రాష్ట్ర రాజ‌కీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మూడేళ్లు మంత్రిగా ప‌నిచేసిన లోకేష్ ఇప్పుడు ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లో త‌న అద్రుష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. మంగ‌ళ‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ గి దిగారు లోకేష్. ఇంత‌వ‌ర‌కూ క‌థ బాగానే ఉన్నా అస‌లుక‌థ ఇక్క‌డే మొద‌లౌతోంది. మామూలు బ‌హిరంగ‌స‌భ‌ల్లో ఉప‌న్యాసం ఇచ్చేప్పుడు త‌డ‌బ‌డే లోకేష్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా నాలుక క‌రుచుకుంటున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్బంగా లోకేష్ మరోసారి ఇరకాటంలో పడ్డారు. ఎన్నోసార్లు బహిరంగ సభల్లో మాట్లాడుతూ పొరపాటున తమ పార్టీని తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక లోకేష్ త‌డ‌బ‌డుతూ మాట్లాడిన వీడియోలను నెట్లో షేర్ చేసి, కామెడీ కూడా చేశారు నెటిజన్లు. ఇప్పుడు తాజాగా మరో సారి నోరు జారి లోకేష్ ఇరుకునపడ్డాడు. వైసీపీ అధినేత జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ తడబడ్డారు. మంగళగిరిలో ప్రచారం చేస్తున్న లోకేశ్‌ ఆదివారం రోడ్‌ షోలో మాట్లాడుతూ వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వివేకా మరణంపై మాట్లాడుతూ.. పాపం వివేకానందరెడ్డి గారు చనిపోయారు..మేము ఎంతో పరవశించాం.

నారా వర్సెస్ ఆళ్ల! పోరు నుంచి తప్పుకొన్న జనసేన పార్టీనారా వర్సెస్ ఆళ్ల! పోరు నుంచి తప్పుకొన్న జనసేన పార్టీ

How are you locked in the campaign? Know how much technology has been developed .. !!

ఎవరు చేశారో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు తెలుసా తల్లి..అంటూ ప్రసంగం కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. వివేకానంద రెడ్డి చనిపోతే.. పరవశిస్తారా..? మీ మనసులో మాట బయటపెట్టారుగా అంటూ.. నెటిజన్లు విపరీతంగా కాంమెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం..!

English summary
Lokesh once again came under fire during the election campaign. There have been occasions when many people have spoken wrongly in their public meetings and have made a mistake.Lokesh did the same in Mangalagiri election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X