వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ వేటీపై ఎంత పెరిగింది?: వేటికి మినహాయింపులు(పిక్చర్స్)

జీఎస్టీతోనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని గట్టిగా నమ్ముతున్న నరేంద్ర మోడీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కాగా, జులై ఒక నుంచి జీఎస్టీ దేశ వ్యాప్తంగా అమల్లోకి రానుంది. అయితే, జీఎస్టీపై చాలా మంద

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-జీఎస్టీ)తోనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని గట్టిగా నమ్ముతున్న నరేంద్ర మోడీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కాగా, జులై ఒక నుంచి జీఎస్టీ దేశ వ్యాప్తంగా అమల్లోకి రానుంది. అయితే, జీఎస్టీపై చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. కానీ, సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే కేంద్రం జీఎస్టీని అమలు చేస్తామని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో ఏ వస్తువుపై ఎంత పన్ను పడుతుందో గమనించినట్లయితే..

ఆటో మొబైల్స్

ఆటో మొబైల్స్

చిన్న కార్ల(30శాతం నుంచి 29శాతం)తో పోలిస్తే పెద్ద ఎస్‌యూవీ వాహనాలపై (55శాతం నుంచి 43శాతం) తేడా వుండనుంది.

మూల ధర(బేస్ ప్రైస్): రూ.4.75లక్షలు

మొత్తం పన్నులు ఇప్పుడు: రూ.1.43లక్షలు

బేస్ ప్రైజ్: రూ. 20,000
మొత్తం పన్ను ఇప్పుడు: 5,300
జీఎస్టీ కింద: రూ. 5,600

కాగా, పన్ను తర్వాత ధరలు కూడా ఇంతకుముందున్న ధరలకు దాదాపు దగ్గరగానే ఉంటాయి.

లైఫ్ ఇన్స్యూరెన్స్

లైఫ్ ఇన్స్యూరెన్స్

ప్రీమియం టర్మ్ ప్లాన్స్, నాన్ లైఫ్ పాలసీలపై పన్ను ఉంటుంది. మిగితా పాలసీలపై ఛార్జీలు(మోర్టాలిటీ, ఏఎంసీ ఛార్జీలు..) మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది.

బేస్ ప్రైస్: రూ.15,000
మొత్తం పన్ను ఇప్పుడు: రూ. 2,250
జీఎస్టీ కింద: రూ. 2,700

బంగారు ఆభరణాలు: తయారీ ఛార్జీలు రూ. 10,000

బంగారు ఆభరణాలు: తయారీ ఛార్జీలు రూ. 10,000

బంగారంపై 3శాతం, తయారీ ఛార్జీలపై 5శాతం జీఎస్టీ ఉంటుంది
బేస్ ప్రైజ్: రూ. 60,000
మొత్తం పన్ను ఇప్పుడు: రూ. 1,800
జీఎస్టీ కింద: రూ. 2,000

హోటళ్లలో బస:

హోటళ్లలో బస:

మీరు తీసుకున్న హోటల్ గది అద్దె రూ.1,000 కంటే తక్కువ ఉంటే జీఎస్టీ ఉండదు. రూ.5000లకు మించితే మాత్రం రూ. 28శాతం పన్ను పడుతుంది.

బేస్ ప్రైజ్: రూ. 7,000
మొత్తం పన్ను ఇప్పుడు: రూ.1,400
జీఎస్టీ కింద: 1,960

రీఫైన్డ్ వంట నూనె

రీఫైన్డ్ వంట నూనె

హెయిర్ ఆయిల్స్ పై 18శాతం జీఎస్టీ ఉండటంతో వాటి ధరలు ఎక్కువానే ఉండనున్నాయి. కొబ్బరి నూనె, రీఫైన్డ్ వంట నూనెలపై 5శాతం మాత్రమే పన్ను ఉండనుంది.

బేస్ ప్రైజ్: రూ.200
పన్ను మొత్తం ఇప్పుడు: రూ. 23
జీఎస్టీ కింద: రూ. 10

విమాన ప్రయాణాలు: ఎకానమీ

విమాన ప్రయాణాలు: ఎకానమీ

ఎకానమీ, బిజినెస్ క్లాసుల మధ్య జీఎస్టీ కారణంగా తేడా మరింత పెరిగింది
బేస్ ప్రైజ్: రూ. 5,000
మొత్తం పన్ను ఇప్పుడు: రూ. 300
జీఎస్టీ కింద: రూ. 250

రైలు ప్రయాణం: ఏసీ కోచెస్

రైలు ప్రయాణం: ఏసీ కోచెస్

లోకల్ ట్రైన్స్, స్లీపర్ క్లాస్ ప్రయాణికులపై జీఎస్టీ ప్రభావం ఏమీ ఉండదు. ఫస్ట్ క్లాస్, ఏసీ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారు పన్ను ఎక్కువ కట్టాల్సిందే.

బేస్ ప్రైజ్: రూ. 3,000
మొత్తం పన్ను ఇప్పుడు: రూ. 131
జీఎస్టీ కింద: రూ. 150

టెలీకాం: 2 ఫోన్స్ 1 డీటీహెచ్ బిల్స్

టెలీకాం: 2 ఫోన్స్ 1 డీటీహెచ్ బిల్స్

వీటిపై జీఎస్టీతో రేట్లు అధికంగానే ఉంటాయి.
బేస్ ప్రైజ్: రూ. 2,500
మొత్తం పన్ను ఇప్పుడు: రూ. 375
జీఎస్టీ కింద: రూ. 450

బయట తింటే: నలుగురు సభ్యుల కుటుంబానికి.

బయట తింటే: నలుగురు సభ్యుల కుటుంబానికి.

నాన్ ఏసీ హోటళ్లలో రూ.12శాతం జీఎస్టీ. 5హోటళ్లలో తింటే.. 28శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే.

బేస్ ప్రైజ్: రూ. 2,000
మొత్తం పన్ను ఇప్పుడు: రూ. 270
జీఎస్టీ కింద: రూ. 360

అప్పెరల్(దుస్తులు): రెడీమేడ్

అప్పెరల్(దుస్తులు): రెడీమేడ్

దుస్తులపై జీఎస్టీని రూ. 1000కి తక్కువగా ఉంటే 5శాతం వసూలు చేస్తారు. వ్యాపారస్తుల ఒత్తిడితో ఒత్తిడితోనే 12శాతంగా ఉన్న పన్నును 5శాతానికి తగ్గించారు.

బేస్ ప్రైజ్: రూ. 2,000
మొత్తం పన్ను ఇప్పుడు: 130
జీఎస్టీ కింద: రూ. 240

వినోదం: నలుగురు కుటుంబసభ్యులతో వెళితే..

వినోదం: నలుగురు కుటుంబసభ్యులతో వెళితే..

రూ.100 టికెట్ వరకూ చిన్న పట్టణాల్లో జీఎస్టీ తక్కువగానే ఉంటుంది.

బేస్ ప్రైజ్: రూ. 12,00
మొత్తం పన్ను ఇప్పుడు(ఎక్సైజ్, సేల్స్ టాక్స్, వినోదపు పన్ను, లగ్జరీ టాక్స్ ఈటీసీ..): రూ. 360
జీఎస్టీ కింద: రూ. 336

వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు

వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు

- బియ్యం, గోధుమలు(అన్ ప్రసెస్డ్) లాంటి అన్ని ధాన్యాలు.
- పాలు, కూరగాయలు, మాంసం, చేపలు, మొదలైనవాటికి.
- లోకల్, స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణాలు.
- విద్య
-హెల్త్ కేర్(మందులకు కాదు)
- రూ. 1000కి మించని హోటల్స్, లాడ్జీల అద్దె గదులు.
- పిల్లల రంగులు లేదా డ్రాయింగ్ బుక్స్
- బిందీలు, సింధూరం, గాజులు, మొదలైనవాటికి జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తోంది.

English summary
Goods and services tax (GST) comes into effect from 1 July. ET Wealth analyses the impact on some basic expenses in the household consumption basket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X