వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదే కడక్‌నాథ్‌ కోడి...దీనికే భలే గిరాకీ!...తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దీనిదే హవా...

|
Google Oneindia TeluguNews

నాటు కోళ్ళ పెంపకం కూడా నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ నాటు కోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి తోడు...చేదోడువాదోడుగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో పెరటి కోళ్ల పెంపకం సైతం నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది. ఈ క్రమంలో నాటు కోడిని తలదన్నేలా ఒక ప్రత్యేక జాతి కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది...కారణమేమింటే...

ఆ కోడి మాంసం కిలో రూ.900, దీని కోడి పిల్ల ఖరీదు 70 రూపాయలు..దీని గుడ్డే ఒక్కటి 45 రూపాయలు...అమ్మో అంత ఖరీదా?...ఏంటి దీని స్పెషాలిటీ అని ఆశ్చర్యపోతున్నారా...ఆ విషయానికి వస్తే ఒక్కటి కాదు...ఈ కోడి పేరు,రూపం దగ్గర్నుంచి అన్నీ ప్రత్యేకతలే...అంతేకాదు దీని మాంసం ఎన్నో పోషక విలువలు కలిగి ఉండటంతో పాటు అరుదైన ఔషధ లక్షణాలు సైతం కలిగి ఉంటుంది. అందుకే ఇది ఇటు మాంసప్రియుల్నే కాదు అటు ఆరోగ్యరాయుళ్లని సైతం విశేషంగా ఆకర్షిస్తోంది...అయితే ఆ కోడి గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని ఉందా?..ఇంకెందుకు ఆలస్యం..చదివేయండి మరి...ఆ కోడి పేరు...కడక్ నాథ్...దీని స్వస్థలం మధ్యప్రదేశ్..

ఎక్కడనుంచి వచ్చింది..ఈ కడక్ నాథ్ కోడి...

ఎక్కడనుంచి వచ్చింది..ఈ కడక్ నాథ్ కోడి...

అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ పెరటి జాతి నాటు కోడి పేరు కడక్ నాథ్. ఈ కోడి ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. ఈ క‌డ‌క్ నాథ్ కోళ్ళ‌ను దీని స్వస్థలం అయిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోకాలి-మాసి(న‌ల్ల‌ని మాంసం క‌ల‌ది) అని పిలుస్తారు. ఇప్పటివరకు ఈ "కడక్ నాథ్" కోడి మధ్యప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే స్థానిక జాతికి చెందిన నాటుకోడిగానే ఉంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో నివసించే గిరిజనులు, కొండ జాతులు, ఆదివాసి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల వారే ఈ కోళ్లను పెంచేవారు. అంతేకాదు వారు దీన్ని పవిత్ర మైన జాతిగా గుర్తించి దీపావళి పండుగలో దేవునికి నైవేద్యంగా పెడతారు. అయితే దీని ప్రత్యేకతల దృష్ట్యా అంతరించి పోతున్న నాటు కోడికి ప్రత్యామ్నాయంగా ఈ కోళ్ళను కూడా పెంచవచ్చని శాస్రవేత్తలు సూచిస్తున్నారు.

 కడక్ నాధ్ కోడి...మరిన్ని వివరాలు...

కడక్ నాధ్ కోడి...మరిన్ని వివరాలు...

ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నల్లగానే ఉంటుంది. ఈ కోళ్ళను కాలామాళి అని కూడా పిలుస్తారు. అరుదుగా, కొన్ని పుంజులు నలుపుతో పాటు బంగారు రంగు ఈకలు కలిగి ఉంటాయి. ఈ కోడి పిల్లలు నీలం రంగు మొదలుకొని నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. అయితే ఇదే జాతి కోడి మరో రెండు రంగుల్లోనూ లభిస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి..నల్లని జాతి జెట్‌ బ్లాక్ రకానికి చెందినవి కాగా ఇవి ఇంకా పెన్సిల్‌, గోల్డెన్ అనే మరో రెండు రంగుల్లోనూ లభ్యమవుతాయి. కడక్ నాథ్ కోళ్ళకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది. 7 నెలల వ్యవధిలో ఈ కోడి కేవలం 1.5 కేజీల బరువు మాత్రమే పెరుగుతుంది.

 రూపంలో...ప్రత్యేకత...

రూపంలో...ప్రత్యేకత...

దీని మాంసం బొగ్గులాగా నల్లగా ఉంటుంది, దీని గురించి తెలియాని వాళ్లకి ఈ కడక్ నాథ్ కోడి చికెన్ బిర్యాని పెడితే మాడగొట్టిన బిర్యానీ పెట్టారని తెగ ఫీల్ అయిపోవడం ఖాయం. దీని మాంసంలో ‘మెలనిన్‌' అనే పిగ్మెంట్‌ ఉండటం వల్లే దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. అయితే రంగు ఎలా ఉన్నా దీని మాంసం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులే చెబుతున్నారు. దీన్ని తింటే జీర్ణ శక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. పైగా ఈ దీని మాంసం ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ కాబట్టి దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు కడక్‌నాథ్‌ కోడి మాంసాన్ని హోమియోపతిలో నరాల సంబంధిత వ్యాధులను నయం చేయడానికి వాడతారు. గిరిజనులు కూడా కడక్‌నాథ్‌ కోడి రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో, మూలికావైద్యంలో ఉపయోగిస్తారు.

మాంసంలో...పోషకాలు...ఔషధ గుణాలు...

మాంసంలో...పోషకాలు...ఔషధ గుణాలు...

కడక్‌నాథ్‌ కోడి మాంసం అంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది, దీని కోడి మాంసంలో 25 శాతం మాంసకృత్తులు ఉంటాయి. బాయిలర్‌ కోడి మాంసంతో పోలిస్తే కడక్‌నాథ్‌ కోడిలో కొలెస్ట్రాల్‌ శాతం చాలా తక్కువ, పైగా దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్‌, విటమిన్లు (బి1, బి2, బి3, బి12), కాల్షి యం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ నికోటినిక్‌ ఆసిడ్స్‌ ఉంటాయి. ఇక ఈ కడక్ నాథ్ కోడి మాంసంలోని ఔషధ గుణాలపై సెంట్రల్‌ ఫుడ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, మైసూర్‌ వారు ప్రత్యేక పరిశోధనలు చేశారు. ఈ కోడి మాంసం హృద్రోగులకు మేలు చేయడమే కాకుండా గుండెకు రక్త సరఫరా పెంచుతుందట. వయాగ్రాలోని సిల్డెనాఫిల్‌ సిట్రిక్‌ రక్త సరఫరా పెంచడం ద్వారా సెక్స్‌ సామర్థ్యం పెంచుతుంది. అదే గుణం ఈ మాంసానికి, రక్తానికి ఉందంటారు. మెలనిన్ అనే పదార్థం ఈ కోడి మాంసంలో ఉండటం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రావం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు.

మరిన్ని ఔషధ లక్షణాలు...పోషకాల గురించి...

మరిన్ని ఔషధ లక్షణాలు...పోషకాల గురించి...

పాస్పరస్, ఇనుము వంటి ధాతువులు మానవ శరీరానికి ఎంతో అవసరమైనవి. ఈ కోడి మాంసంలో ఇనుప ధాతువు బి2 అధికంగా ఉండటం వలన న్యూమోనియా, ఎనిమియా, క్షయ, ఆస్తమా వ్యాధుల నివారణకు కటక్నాథ్ కోడి మాంసం మంచి ఆహారంగా పనిచేస్తుంది. వాటితో పాటు అనేక స్థూల, సూక్ష్మధాతువులు కలిగి ఉండడం వల్ల కీళ్ళ సమస్యలు, ఎముకలు విరిగిన వారికి ఇది అద్భుత ఆహారంగా భావించవచ్చు. శరీరానికి అవసరమైన ఓమోగా ఆమూల ఫాటో యాసిడ్ ప్రతిరూపమైన లినోలెనిక్ యాసిడ్ ఈ కోడి మాంసంలో ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. వీటి గుడ్లని తలనొప్పి నీరసం, ఆస్తమా, మూత్రపిండాల సంబంధిత వ్యాధులను తగ్గించడానికి వాడుతారు. వయసు మళ్ళీన వారికి వీటి గుడ్లు చాలా ఆరోగ్యదాయకం.

ఈ కోళ్ల పెంపకంతో...మంచి ఆదాయం...

ఈ కోళ్ల పెంపకంతో...మంచి ఆదాయం...

నాటుకోడి మాదిరిగానే మంచి రుచిగా వుండే కడక్‌నాథ్‌ కోళ్లపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి వుందని కోరుట్ల పశువైద్య కళాశాల వైద్య నిపుణులు డా. శ్రీనివాస్ అంటున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నఈ కడక్ నాథ్ కోడి పిల్లలను ప్రభుత్వ ఏజెన్సీల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తే రైతులకు మరింత ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్‌ సంస్థలు విక్రయిస్తున్న ఒక్కో కోడి పిల్ల 65 నుంచి 70 రూపాయల ధర పలుకుతున్నది. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వీటి పెంపకం చేపడుతున్నారు.

English summary
The Kadaknath is an Indian breed of chicken local to the Madhya Pradesh area, where it is known as "Kali masi" ("fowl having black flesh"). The Kadaknath is popular mainly for its adaptability, and the good-tasting black meat. , which is believed to infuse vigor. Its color stems from the deposition of melanin pigment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X