చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ పార్టీని ఎలా నడుపుతున్నారో తెలుసా? మోడీ మాటలు గుర్తు చేసిన జనసేన

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు తదితర ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు. అనంతరం చిత్తూరులోని గాంధీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ నుంచి ఎక్కువ మందికి కొత్త వారికి అవకాశమిస్తానని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ ఎలా నడుస్తుందనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

<strong>తప్పుడు ప్రచారం ఆపండి: ఇండియన్ మీడియాపై పవన్ కళ్యాణ్, ఇవి చూడండి(వీడియో)</strong>తప్పుడు ప్రచారం ఆపండి: ఇండియన్ మీడియాపై పవన్ కళ్యాణ్, ఇవి చూడండి(వీడియో)

పార్టీని ఎలా నడిపిస్తున్నానంటే?

పార్టీని ఎలా నడిపిస్తున్నానంటే?

టీడీపీ, వైసీపీలపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. పార్టీ నడిపేందుకు తన వద్ద వేల కోట్లు లేవని వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాలు రాయలసీమ సంపదను దోచుకుంటున్నాయన్నారు. అభిమానులు, జనసైనికులు ఇచ్చే బలంతో పాటు మీరంతా ఇచ్చే విరాళాలు, స్నేహితుల సహకారంతో పార్టీని నడుపుతూ ప్రజాసమస్యలపై పోరాడుతున్నట్లు జనసేనాని తెలిపారు.

ప్రజారాజ్యం దెబ్బ గురించి

ప్రజారాజ్యం దెబ్బ గురించి

ప్రజారాజ్యం పార్టీ ద్వారా దెబ్బతిన్న తర్వాత జనసేన పార్టీని స్థాపించానని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. దెబ్బతిన్న వాడు పెట్టిన పార్టీ జనసేన అని, అవినీతి వ్యవస్థ తుక్కు రాలకొట్టడానికి పెట్టిన పార్టీ అని, మీ జీవితాల కోసం భరోసా తనమీద పెట్టాలన్నారు.

మోడీ మాటలు గుర్తు చేసిన జనసేన

అదే సమయంలో తన దేశభక్తి గురించి బీజేపీ నేతలు మాట్లాడటంపై కూడా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. నా దేశభక్తి గురించి నేతలు... ప్రధాని నరేంద్ర మోడీని అడగాలని, ఆయన చెబుతారని, బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. జీవీఎల్ తన దేశభక్తి గురించి శంఖించారని, ఎక్కడ తగ్గాలో తెలుసునని, అది తెలుసుకోకుండా రాలేదని చెప్పారు. తన దేశభక్తి గురించి మోడిని పవన్ చెప్పడంతో పాటు జనసేన... మోడీ చేసిన ట్వీట్‌నురీ ట్వీట్ కూడా చేసింది. 2014లో మోడీ - పవన్ కలుసుకున్నప్పుడు ప్రధాని పొగిడిన వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టును పెట్టింది. 'పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యాను. ఇది మా తొలి సమావేశం. అతని (పవన్ కళ్యాణ్) తీరు, దేశసేవ పట్ల నిబద్ధత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది' అని మోడీ 21 మార్చి 2014న ట్వీట్ చేశారు. దీనిని జనసేన రీట్వీట్ చేసింది.

English summary
Janasena chief Pawan Kalyan said in his Chittoor district tour that he is running the party with Janasainiks donations and Friends help.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X