'జగన్‌కు ప్రణబ్ అపాయింట్‌మెంట్ ఎలా ఇచ్చారు, రమాకాంత్‌ను విచారించాలి'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింటుమెంట్ ఇవ్వడాన్ని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

జగన్‌కు ఢిల్లీ పెద్దల ఇంటర్వ్యూపై చంద్రబాబు ఆగ్రహం

అక్రమాస్తుల కేసులు ఎదుర్కొంటున్న, 11 చార్జీషీట్లలో నిందితుడు అయిన జగన్‌కు ఢిల్లీ పెద్దలు ఎలా అపాయింటుమెంట్ ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రెండు రోజుల క్రితం అన్నారు.

ys jagan

తాజాగా, తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ బెయిల్ మీద ఉన్న నిందితుడు అని, ఆయనకు రాష్ట్రపతి ఎలా అపాయింటుమెంట్ ఇచ్చారని ప్రశ్నించారు. జగన్ తన పత్రికల ద్వారా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వర్ల ఆరోపించారు. మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డిని కూడా విచారించాలన్నారు.

నేను తినను, ఎవర్నీ తిననివ్వను: జవహర్

ఎవరినీ తిననివ్వను, తాను కూడా తిననని, గడ్డివాము దగ్గర కుక్కలా కాపలా కాస్తానని ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జవహర్ చెప్పుకొచ్చారు. ఎక్సైజ్‌ను ఆదాయ వనరుగా చూడటం లేదన్నారు. త్వరలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader Dulipalla Narendra on Monday questioned how President Pranab Mukherjee gave appointment to YSRCP chief YS Jagan.
Please Wait while comments are loading...