వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసుక సమస్యను కూడ పరిష్కరించలేని వారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేస్తారు...?

|
Google Oneindia TeluguNews

ఇసుక కొరతపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్ష టీడీపీ మాటల యుద్దం మరింత ఉదృతం చేసింది. ఈ నేపథ్యంలోనే కనీసం ఇసుక సమస్యను కూడ పరిష్కరించలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని రానున్న కాలంలో ఎలా అభివృద్ది వైపు నడిపిస్తుందని ఆపార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు తిండిలేక ఇబ్బందిపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుక కొరతపై గత అయిదు నెలలుగా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తుందని, దీని వల్ల ఎలాంటీ ఉపయోగం లేదని అన్నారు. ఇసుక సమస్యల వల్ల తాపీ మేస్త్రీల నుండి సిమెంట్ కంపనీల వరకు ఎవరికి పని లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన వారోత్సవాలతో తగ్గుముఖం పడుతుందా అంటూ ఆయన నిలదీశారు.

How the state will be developed, not even clear the sand problem

ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరిగా పనిచేయలేక పోతుందని ఆయన విమర్శించారు. ఇక ప్రభుత్వ సోమ్ముతో సకల సౌకర్యాలు పొందుతున్న సలహదారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థాకంగా మారిందని అన్నారు.

మరోవైపు ఇసుక తెలంగాణలో లేనప్పుడు ఏపీలో ఎందుకు ఉత్పన్నమవుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఇసుక సమస్యను ఎన్నాళ్లు సాగదీస్తారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇసుక సమస్యపై ట్వీట్లు మాత్రం బాగా చేస్తున్నారని అన్నారు. ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న వారిని కనీసం పరామర్శించేదని ఆయన విమర్శించారు. ఇక మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. సామాజిక వర్గాల గురించి వారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

English summary
not even sand issue was not cleared but how the state will be going to develop in the future days.TDP leader Somireddi Chandramohan Reddy questioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X