వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు కేంద్రం ప్రశంసలు- కరోనాలోనూ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమంటూ...

|
Google Oneindia TeluguNews

కరోనా సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్ధలు పని చేయలేదు. విద్యార్ధులు ఇళ్లకే పరిమితమయ్యారు. అదే సమయంలో ఏపీలోనూ విద్యార్ధులు ఇళ్లకే పరిమితమైనా ప్రభుత్వం వారి కోసం పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్ధుల భవిష్యత్తుతో పాటు అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం జగన్‌ సర్కారు పలు కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. కేంద్రం తాజాగా వీటిని ప్రశంసించింది.

జగన్ తప్పు దిద్దుకున్నారు- జస్టిస్ రమణ అంశంలో చెంపపెట్టులా ఆమె - మోదీదే బాధ్యత: ఎంపీ రఘురామజగన్ తప్పు దిద్దుకున్నారు- జస్టిస్ రమణ అంశంలో చెంపపెట్టులా ఆమె - మోదీదే బాధ్యత: ఎంపీ రఘురామ

ఇవాళ వెబినార్‌ ద్వారా జరిగిన ఎన్‌సీఈఆర్‌టీ 57వ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రమంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, మానవ వనరులశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇందులో ఏపీ నుంచి పాల్గొన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వైసీపీ సర్కారు కరోనా సమయంలో అమలు చేసిన విద్యాకానుక, నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద వంటి ప్రభుత్వ పథకాలను ఆయనకు వివరించారు.

hrd minister ramesh pokhriyal appraisal to ys jagan for his policies even in covid 19 time

ఆ తర్వాత దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌డీ మంత్రి పోఖ్రియాల్‌.. సీఎం జగన్‌ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్‌ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యయస్ధ ప్రజలకెంతో మేలు చేసేదిగా ఉందన్నారు. విద్యార్దుల కోసం జగన్‌ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని, విద్యామృతం, విద్యా కలశం పేరుతో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపైనా అభినందనలు తెలిపారు. విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అదనపు బడ్జెట్‌ కేటాయించడాన్ని కేంద్రమంత్రి పోఖ్రియాల్‌ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా జగన్‌ ప్రభుత్వ పథకాలను అనుసరిస్తే బావుంటుందని కితాబిచ్చారు.

English summary
union hrd minister ramesh pokhriyal on thursday praises andhra pradesh government and chief minister ys jagan's initiatives towards better education even in covid 19 time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X