• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రత్యేక హోదా-రఘురామ రాజు ఎపిసోడ్ : సీఎం జగన్ దిశానిర్దేశం : పార్టీ ఎంపీలతో భేటీ...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఈ సమయంలో పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు. ఇందులో ప్రధానంగా పార్లమెంట్ లో కేంద్రంతో వ్యవహరించాల్సిన తీరు పైన సీఎం పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉంటూ..కేంద్రానికి సహకరిస్తూనే ఉన్నారు. అయితే, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవటంతో వైసీపీ నేతలు లోలోపల మాత్రం అసహనంతో ఉన్నారు.

పార్లమెంట్ సభ్యులతో సీఎం కీలక భేటీ

పార్లమెంట్ సభ్యులతో సీఎం కీలక భేటీ


ఇక, తాజాగా తిరుపతిలో జరిగిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా.. రుణాల మంజూరు...రెవిన్యూ లోటు వంటి అంశాలతో పాటుగా నీటి ప్రాజక్టుల అంశాలను వివరించారు. వీటి పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఏపీ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలు రాష్ట్రానికి సంబంధించినవే కాదని.. జాతీయ స్థాయిలోనూ ఫోకస్ చేయాల్సిన అంశాలంటూ పేర్కొన్నారు. వీటికి పరిష్కారం చూపుతామని చెప్పుకొచ్చారు.

రఘురామ రాజు ఎపిసోడ్ లో ఏం జరుగుతోంది

రఘురామ రాజు ఎపిసోడ్ లో ఏం జరుగుతోంది

ఇక, ఇప్పుడు పార్టీ ఎంపీలకు సైతం తిరిగి పార్లమెంట్ కేంద్రంగా ఈ అంశాలను ప్రస్తావించాలని సొంత ఎంపీలకు జగన్ సూచించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు, పెండింగ్‌ ప్రాజెక్టులు.. విభజన చట్టంలో అమలుకు నోచుకోని అంశాలు సహా వివిధ అంశాలతో ఈ సమావేశాల్లో వైసీపీ ప్రస్తావించాలని భావిస్తోంది. ఇదే సమయంలో పార్టీ రెబల్ ఎంపీ రఘురామ రాజు అంశం పైన ఇప్పటికే పలు మార్లు వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను అనర్హత వేటు వేయాలని కోరారు. దీని పైన స్పీకర్ కార్యాలయం రఘురామ రాజుకు నోటీసులు జారీ చేసింది. వివరణ కోరింది.

పోలవరం నిధులే ప్రధాన అంశంగా

పోలవరం నిధులే ప్రధాన అంశంగా

ఇక, కొద్ది రోజుల క్రితం ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలోనూ ఆయన అనర్హత పిటీషన్ పరిశీలనలో ఉందంటూ స్పీకర్ చెప్పుకొచ్చారు. గత సమావేశాల్లోనే రఘురామ రాజు పైన చర్యలు ఉంటాయంటూ వైసీపీ ఎంపీలు చెప్పారు. కానీ, ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. దీంతో..ఈ సమావేశాల్లో మరోసారి రఘురామ పైన చర్యల అంశం కీలకంగా వైసీపీ ఎంపీలు ప్రస్తావించే ఛాన్స్ కనిపిస్తోంది. అదే విధంగా పోలవరం నిధుల గురించి ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. సవరించిన అంచనాలను ఆమోదించాలని అమిత్ షా ను సైతం సీఎం జగన్ కోరారు.

  CM Jagan భారీ స్కెచ్.. AP Capital అభివృద్ధి కోసం 50 వేల కోట్ల రుణం! || Oneindia Telugu
  రుణ పరపతిపై మినహాయింపులు కోరుతూ

  రుణ పరపతిపై మినహాయింపులు కోరుతూ

  కేంద్రం నుంచి నిధులు రాకుంటే..పోలవరం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తన హయాంలోనే పోలవరం పూర్తి చేయాలని..ఇప్పటికే జగన్ డెడ్ లైన్ ఫిక్స్ చేసారు. కానీ, నిధులు సమస్యగా మారుతున్నాయి. దీంతోత..పోలవరం నిధులు.. రెవిన్యూ లోటు ..రుణ పరమితి పెంపు అంశాల పైన పార్లమెంట్ సభ్యులను సీఎం జగన్ ఏ రకంగా ముందుకెళ్లాలో దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్నాహ్నం ఈ సమావేశం జరగనుంది.

  English summary
  Chief Minister Jagan is scheduled to meet party MPs. In this, the CM will give direction to the party MPs mainly on how to deal with the Center in Parliament
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X