వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ ఒడి పథకానికి భారీగా దరఖాస్తులు .. 75% హాజరు ఉంటేనే ... మరిన్ని షరతులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Amma Vodi Scheme : Applications Started For Amma Vodi Scheme, Here Is The Full Details !

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చిన్నారుల చదువుల కోసం, అందమైన భవితవ్యం కోసం ప్రవేశపెట్టిన పథకం అమ్మ ఒడి .ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాలలో అమ్మ ఒడి ఒకటి. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్నా, తాను అందిస్తానని చెప్పిన పథకాలను అందించి తీరుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. అలాంటి నవరత్నాల హామీనే అమ్మ ఒడి. ఇక అమ్మ ఒడి జనవరి నుండి అమలు కానుంది అని ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో అమ్మ ఒడి పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

అమ్మ ఒడి అమలుకు జనవరి నుండి శ్రీకారం.. సీఎం జగన్ నిర్ణయంతో అమ్మలకు సంతోషం అమ్మ ఒడి అమలుకు జనవరి నుండి శ్రీకారం.. సీఎం జగన్ నిర్ణయంతో అమ్మలకు సంతోషం

 అమ్మ ఒడి పథకానికి వెల్లువగా దరఖాస్తులు

అమ్మ ఒడి పథకానికి వెల్లువగా దరఖాస్తులు

వై ఎస్ జగన్ ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీలో భాగంగా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి' పధకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇక ఆ మాట నిలబెట్టుకోటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. జనవరి 26 నుండి ఈ పథకం అందుబాటులోకి రానుంది .అయితే అమ్మ ఒడి పథకం అందరికీ అందించాలని భావించిన ప్రభుత్వానికి పథకం కోసం వస్తున్న దరఖాస్తులు షాక్ కు గురి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమ్మఒడి కింద దాదాపు 43 లక్షల మంది తల్లులకు ఈ పథకం అందించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

ప్రభుత్వానికి ఆర్ధిక భారం తగ్గించేందుకు మరికొన్ని కండీషన్స్

ప్రభుత్వానికి ఆర్ధిక భారం తగ్గించేందుకు మరికొన్ని కండీషన్స్

అమ్మ ఒడి పథకం కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,455 కోట్లు కేటాయించింది. అయితే ఈ పథకాన్ని తెల్లరేషన్ కార్డ్ ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని అధికారులు చెప్పినా ఇప్పుడు మరి కొన్ని ఆంక్షలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దరఖాస్తులు పోటెత్తుతున్న నేపధ్యంలో అసలే పీకల్లోతు అప్పుల్లో ఉన్న ప్రభుత్వానికి మరింత ఆర్ధిక భారం పడనుందని భావిస్తున్న అధికారులు లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని సమాచారం .

గురుకుల పాఠశాలలు, వివిధ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అమ్మ ఒడి లేనట్టే ?

గురుకుల పాఠశాలలు, వివిధ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అమ్మ ఒడి లేనట్టే ?

అమ్మఒడి పథకాన్ని అందించాలని అందరికీ వర్తింపజెయ్యాలని జగన్ ఆదేశిస్తే గురుకుల పాఠశాలలు, వివిధ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు వర్తింపచేయాలా, వద్దా అనేది ఆలోచిస్తున్నారని సమాచారం. ఎందుకంటె అక్కడ విద్యార్థులకు ప్రభుత్వమే ఉచిత విద్యనూ అందిస్తుంది. అలాగే వసతి, భోజనం కూడా అందిస్తుంది. కాబట్టి ఆ విద్యార్థులకు అమ్మ ఒడి అవసరామా అని చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే వారికి పథకం వర్తించకుండా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది.

 విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి

విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి

ఇన్‌కంటాక్స్ చెల్లిస్తున్నవారు, ఐదెకరాల పొలం ఉన్నవారికి ఈ పథకాన్ని అమలు చేయకూడదని ప్రభుత్వం భావిస్తుందని సమాచారం . ఇకపోతే విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. విద్యార్థులు చదువు లక్ష్యంగా ప్రభుత్వం అందించే ఈ బృహత్తర పథకం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే పథకం అందించే విద్యార్థులకు హాజరు శాతం తప్పనిసరి . అయితే ఇప్పటికే లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్న అధికారులు, సీఎం జగన్ నుండి లేదా విద్యా శాఖ నుండి అధికారికంగా వచ్చే నిర్ణయాన్ని బట్టి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా మరిన్ని కఠినమైన ఆంక్షలతోనే ఈ పథకాన్ని అందించనున్నారని తెలుస్తుంది.

English summary
The AP government has allocated Rs 6,450 crore for the implementation of the Amma odi scheme. Those who have a white ration card and Aadhaar card are eligible to avail the scheme. There are also some conditions because of the huge applications from the people. tax payers and i acres land owners are not eligible for the scheme .the government hopes to implement the scheme only if the students attend 75 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X