వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు సీట్లలో సమూల మార్పులు..!రెండు వరుసలకు బదులు మూడు వరసలు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సుల్లో అనూహ్య మార్పులు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రయాణీకుల మద్య సామాజిక దూరం ఉండేట్టు జాగ్రత్తులు తీసుకుంటోంది ఆర్టీసీ సంస్థ. అందుకు అనుగుణంగా సూపర్ లగ్జరీ బస్సులలో ఆర్టీసీ అధికారులు సమూలంగా మార్చాలని నిర్ణయించారు. దీని కోసం సీట్ల మధ్య దూరం గణనీయంగా పెంచారు. గతంలో మాదిరిగా రెండు వరుసలు కాకుండా, మూడు వరుసలు ఏర్పాటు చేశారు. ఈ వరుసలో ఓకే సీటు ఉండేలా చర్యలు తీసుకున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు కనీసం ఐదు గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉండడంతో ఏపిఎస్ఆర్టీసి తగు జాగ్రత్తులు తీసుకుంటోంది.

Recommended Video

APSRTC Bus Seats Changed || ఇక రెండు వరుసలు కాదు మూడు వరుసలు...!!

ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయ్: నీళ్లు చల్లిన కోయంబేడు: వలంటీర్లకు కొత్త టాస్క్ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయ్: నీళ్లు చల్లిన కోయంబేడు: వలంటీర్లకు కొత్త టాస్క్

 మారిన బస్సు సీట్లు.. సోషల్ డిస్టెన్స్ కోసం ఏపి ప్రభుత్వం కొత్త ప్రయోగం..

మారిన బస్సు సీట్లు.. సోషల్ డిస్టెన్స్ కోసం ఏపి ప్రభుత్వం కొత్త ప్రయోగం..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కరోనా మహమ్మారి నుండి కోలుకున్నాక వ్యవస్థలన్నీ గాడినపడనున్నాయి. గత 50రోజులుగా నిలిచిపోయిన రవాణా వ్యవస్థను కూడా పునరుద్దరించాలని అధికారలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి కీలక ఆదాయ వనరైన రవాణా వ్యవస్థను సాద్యమయినంత తోందరగా పునరుద్దరించి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రణళికలు రచిస్తోంది ఏపి ప్రభుత్వం. మే 17 నుండి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలపైన కీలక నిర్ణయం తీసుకోనున్నందున అందుకు తగ్గట్టే రాష్ట్రాలు తమ వ్యూహాలను అమలు చేయబోతున్నాయి. కరోనా ఆంక్షలకు కట్టుబడే మరిన్ని వ్యవస్థలకు మినహాయింపులివ్వాలని భావిస్తున్నాయి.

 గతంలో రెండు వరుసలు.. ఇప్పుడు ఒక వరుస మాత్రమే..

గతంలో రెండు వరుసలు.. ఇప్పుడు ఒక వరుస మాత్రమే..

ఆంధప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రజా రవాణ వ్యవస్తను పునరుద్దరించేందుకు వేగవంతమైన ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వైరస్ కట్టడికోసం విధించిన లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఇప్పటికే మోయలేని ఆర్థిక బారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. దీంతో లాక్‌డౌన్ ముగిసిన తర్వాత బస్సులు నడిపేందుకు అవసరమైన కసరత్తులను ప్రారంభించింది ప్రభుత్వం. ఈమేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా బస్సుల్లో సీట్లను కొత్తగా అమరుస్తున్నారు.

 బస్సుల్లో మాస్కులు, శానిటైజర్ల సౌకర్యం.. సామాజిక దూరంతో సీట్ల ఏర్పాటు..

బస్సుల్లో మాస్కులు, శానిటైజర్ల సౌకర్యం.. సామాజిక దూరంతో సీట్ల ఏర్పాటు..

ఏపి బస్సుల్లో కొత్త సీట్ల విదానానికి సంబంధించిన ఒక మోడల్‌ ఫొటోను కూడా విడుదల చేశారు. సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ అధికారులు సమూలంగా మార్చాలని నిర్ణయించారు. దీని కోసం సీట్ల మధ్య దూరం పెంచారు. గతంలో మాదిరిగా కాకుండా, మూడు వరుసలు ఏర్పాటు చేశారు. ఈ వరుసలో ఓకే సీటు ఉండేలా జాగ్రత్తులు తీసుకున్నారు అధికారులు. దీని ద్వారా భౌతిక దూరం పాటించేందుకు ఎక్కువ వీలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈ మోడల్‌కు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన వెంటనే మిగిలిన వాటిని కూడా మార్చేసి బస్సు సేవలను ప్రారంభించేందుకు సిద్దమవుతున్నట్టు అదికారులు తెలిపారు.

 మే 17తర్వాత రోడ్లెక్క నున్న బస్సులు.. సన్నాహాలు చేస్తున్న ఏపీ అధికారలు..

మే 17తర్వాత రోడ్లెక్క నున్న బస్సులు.. సన్నాహాలు చేస్తున్న ఏపీ అధికారలు..

కాగా గతంలో సూపర్ లగ్జరీ బస్సులో మొత్తం 36 సీట్ల సామర్థ్యం ఉండగా, తాజాగా కొత్త అమరికల ద్వారా పది సీట్ల తగ్గే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీపై కొంత ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే బస్సుల్లో కూడా ప్రత్యేకంగా శానిటైజర్లు, మాస్కులు ఉండేలా చూస్తామంటున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. అయితే కొత్తగా చేస్తున్న మార్పులు, సీట్ల తగ్గింపు, ఇతర సౌకర్యాల వల్ల మరికొంత ఆర్థిక భారం పడే అవకావం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక భారాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం ఛార్జీలు ఏమైనా పెంచే అవకాశం ఉందా అనే అంశం పై ఉత్కంఠ నెలకొంది.

English summary
Andhra Pradesh Road Transport Corporation (APSRTC) buses are making unimaginable changes. RTC is taking a vigil to the social distance of passengers under the influence of coronavirus. Accordingly, RTC officials have decided to convert in super luxury buses. For this, the distance between the seats is significantly increased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X