చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్: 20 మందికి గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్.. 20 మందికి గాయాలు..!

తిరుపతి: చిత్తూరు జిల్లాలో భోగీ సందర్భంగా జల్లికట్టు పెద్ద యెత్తున జరిగింది. ఆదివారంనాడు జరిగిన జల్లికట్టులో యువకులు పెద్ద యెత్తున పాల్గొని తమ సత్తా చాటుకోవడానికి ప్రయత్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుపల్లిల ఆదివారంనాడు జరిగింది. జల్లికట్టు సాధారణంగా కనుమ రోజు జరుగుతుంది. కానీ, ఇక్కడ భోగీనాడే ప్రారంభమైంది.

Jallikattu

అత్యంత ప్రమాదకరమైన జల్లికట్టును ఆడడానికి, చూడడానికి 6 వేల మందికి పైగా అనుపల్లి చేరుకున్నారు. బలమైన కోడెగిత్తలను అదుపు చేసి, తన చెప్పు చేతల్లోకి తీసుకుని రావడం ఈ జల్లికట్టు క్రీడ ప్రత్యేకత.

అనుపల్లి జల్లికట్టులో 20 మంది దాకా గాయపడ్డారు. వారిలో నలుుగురి తలలకు గాయాలయ్యాయి. నిర్వాహకులు వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. జల్లికట్టుపై పోలీసులు ఓ రోజు ముందే హెచ్చరించారు. కానీ నిర్వాహకులు హెచ్చరికలను పెడచెవిన పెట్టారు.

సాహసోపేతమైన జల్లికట్టు క్రీడను చూడడానికి హైదరాబాదు, బెంగళూరుల నుంచి కూడా వచ్చారు. ఇది ఆనందోత్సహాలకు చెందిన పండుగ అని అంటున్నారు.

English summary
Youths took part in Jallikattu in massive numbers at Anupalli under Ramachandrapuram mandal in Chittoor district on the occasion of Bhogi on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X