• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IAS Srilakshmiకి రూట్ క్లియర్ : సీఎం జగన్ మర్చిపోలేదు : నాడు కష్టాలు..నేడు కీలక పదవి దిశగా..!!

By Lekhaka
|

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఇచ్చిన రెండు ప్రమోషన్లను నిబందనల ప్రకారం రెగ్యులర్ పదోన్నతులుగానే గుర్తించాలని పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అమెపై పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో వెలువడే నిర్ణయాన్ని బట్టి.. పదోన్నతి కొనసాగింపు ఉంటుందని ప్రమోషన్ సమయంలో ప్రభుత్వం పేర్కొంది. తిరిగి..మార్చిలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఇప్పుడు ఈ రెండు రెగ్యులర్ ప్రమోషన్లుగా ప్రభుత్వం గుర్తిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

 ఏపీకి తెచ్చేందుకు ప్రయత్నాలు..

ఏపీకి తెచ్చేందుకు ప్రయత్నాలు..

ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ కేడర్ లో ఉన్న శ్రీలక్ష్మీని ఏపీకి తీసుకొచ్చేందుకు జగన్ కష్టపడాల్సి వచ్చింది. తొలుత సరైన కారణాలు లేవని..ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ సాధ్యం కాదని డీఓపీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా...సీఎం జగన్ నేరుగా ప్రధాని వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లి..శ్రీలక్ష్మీకి తన ప్రభుత్వంలో పని చేసే అవకాశం కల్పించారు. శ్రీలక్ష్మి వరుసగా రెండు ప్రమోషన్లు దక్కించుకొని ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నారు.

 జగన్ కేసుల్లో శ్రీలక్ష్మి..

జగన్ కేసుల్లో శ్రీలక్ష్మి..

వైఎస్సార్ హయాంలో శ్రీలక్ష్మీ పరిశ్రమల శాఖా కార్యదర్శిగా పని చేసారు. జగన్ పైన నమోదైన సీబీఐ కేసుల్లో భాగంగా.. ఓబులాపురం మైనింగ్ కేసులో నాటి పరిశ్రమల శాఖా కార్యదర్శిగా పని చేసిన శ్రీలక్ష్మి పైన అభియోగాలు నమోదయ్యాయి. చాలా రోజులు శ్రీలక్ష్మి జైలులో ఉండాల్సి వచ్చింది. క్యాప్టివ్ మైనింగ్ లో ఉద్దేశ పూర్వకంగా శ్రీలక్ష్మీ జీవోలో కొందరికి అనుకూలంగా వ్యవహరించారనేది నాటి అభియోగం. జైలులో ఉన్న సమయంలో శ్రీలక్ష్మీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆ తరువాత విడుదలైన శ్రీలక్ష్మీకి తెలంగాణ ప్రభుత్వంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే, జగన్ సీఎం అయిన తరువాత తన పైన రాజకీయంగా పెట్టిన కేసుల్లో శ్రీలక్ష్మీ సైతం ఇబ్బందులు పడాల్సి వచ్చిందనే భావనతో తన ప్రభుత్వంలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

 కేంద్రం నుండి అభ్యంతరాలు..

కేంద్రం నుండి అభ్యంతరాలు..

ఇదే అభిప్రాయంతో నాడు తెలంగాణ ముఖ్యమంత్రికి స్వయంగా శ్రీలక్ష్మి విషయాన్ని జగన్ నివేదించగా..ఆయన వెంటనే ఆమోదించారు. కానీ, కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక, ఇప్పుడు శ్రీలక్ష్మీకి అధికారికంగా ఏపీ కేడర్ కు బదిలీ జరగాల్సి ఉంది. ఇదే సమయంలో శ్రీలక్ష్మికి రానున్న రోజుల్లో ప్రభుత్వంలో కీలక పదవి దక్కబోతోందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాద్ దాస్ 1987 బ్యాచ్ అధికారిక. ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే, సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసారు. ఆమోదం లభిస్తుందనే అంచనాతో ఉన్నారు. సెప్టెంబర్ చివరి వరకు దాస్ కొనసాగనున్నారు.

 అన్నీ అనుకూలిస్తే..ఏపీ సీఎస్ గా..

అన్నీ అనుకూలిస్తే..ఏపీ సీఎస్ గా..

ఆ తరువాత 1988 బ్యాచ్ కు చెందిన గిరిధర్, పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మీ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారు. జవహర్ రెడ్డి పేరు ప్రచారంలో ఉన్నా ఆయన 1990 బ్యాచ్ కు చెందిన అధికారి. అయితే, ఈ ముగ్గరిలో సీఎం జగన్ శ్రీలక్ష్మికి సీఎస్ పదవి అప్పగించే అవకాశం ఉందని అప్పుడే ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే, కోర్టులో ఉన్న కేసులు...ఇంటర్ స్టేట్ కేడర్ బదిలీ వంటి విషయాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. కేంద్రం నుండి కావాల్సిన అన్ని అనుమతులు తీసుకొని శ్రీలక్ష్మీ ఏపీ సీఎస్ గా అవుతారని కొంత మంది అధికారులు చెబుతున్నారు. సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుంటే...అక్టోబర్ లో శ్రీలక్ష్మీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

English summary
AP govt confirmed the promotion of IAS SriLakshmi as regular.With this she might be posted as Chief Secretary in the month of September.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X