• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్క కేసులో చెల్లెలు పట్టు: అప్పుడే శ్రీగౌతమితో పరిచయం, రహస్యంగా పెళ్లి.. భార్యకు తెలిసి..

By Srinivas
|

ఏలూరు: తన సోదరి శ్రీగౌతమిని నిర్ధాక్షిణ్యంగా చంపిన వారికి కోర్టులో శిక్ష పడేవరకు తాను తన పోరాటాన్ని ఆపేది లేదని ఆమె సోదరి పావని వెల్లడించారు. నిందితులకు శిక్ష పడితేనే తన అక్క ఆత్మ శాంతిస్తుందని చెప్పారు. ఇది హత్యేనని తాము మొదటి నుంచి చెబుతున్నా, తమ ఆవేదన పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సీఐడీ చొరవతో వాస్తవం బయటకు వచ్చిందన్నారు. శిక్ష పడే వరకు పోరాడుతానని చెప్పారు.

ఏడాదిన్నర కేసులో కీలక మలుపు, శ్రీగౌతమిది హత్యే: నిందితులు టీడీపీ వాళ్లు, అసలేం జరిగింది?

శ్రీగౌతమి హత్యకు కారణమైన జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్‌, దర్బరేవు మాజీ సర్పంచి సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రాంప్రసాద్, బాలం ఆండ్రూలను అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. కేసు విచారణ కొంత పూర్తయిందని, ఏడుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు.

 వివాహేతర సంబంధం.. రహస్యంగా పెళ్లి

వివాహేతర సంబంధం.. రహస్యంగా పెళ్లి

శ్రీగౌతమి, సజ్జా బుజ్జి వివాహేతర సంబంధం నేపథ్యంలో వారు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రాయపేట ఇంటికి తీసుకెళ్లి కాపురం పెట్టమని గౌతమి... బుజ్జిని ఎప్పుడూ అడిగేది. బుజ్జికి బంధువైన బొల్లంపల్లి రాంప్రసాద్‌కు గౌతమి సోదరి పావనితో పరిచయముంది. ఆమె కూడా రాంప్రసాద్‌ను అడిగేది. దీంతో బుజ్జి, రమేష్‌లు కలిసి వారిద్దరిని చంపేయాలనే ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని బాలం ప్రతాప్‌కు తెలిపారు. అతను విశాఖలో ఉంటున్న బాలం ఆండ్రూను పిలిపించి, నలుగురు కలిసి పథకం రచించారు.

అరెస్టయ్యేందుకు ముందే ప్లాన్

అరెస్టయ్యేందుకు ముందే ప్లాన్

ఈ నలుగురు పథకంతో బాలం ఆండ్రూ.. విశాఖపట్నంకు చెందిన సందీప్, దుర్గాప్రసాద్‌లను పురపాయించాడు. ప్రమాదానికి కారణమైన కారు కొనేందుకు రూ.2 లక్షలను బుజ్జి సమకూర్చాడు. ప్రమాదం విషయంలో అరెస్టయ్యేందుకు సందీప్, దుర్గాప్రసాద్‌లు సిద్ధమయ్యారు. ప్రమాదం జరిగిన రోజు రాంప్రసాద్ ఇంటి వద్ద బుజ్జి ఉన్నాడు. అదే సమయంలో అక్కడకు అక్కాచెల్లెళ్లు శ్రీగౌతమి, పావని వెళ్లారు.

అతను సమాచారం ఇస్తుండగా

అతను సమాచారం ఇస్తుండగా

ఆ తర్వాత శ్రీగౌతమి, పావనిలు బైక్ పైన పాలకొల్లు వెళ్లారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం సందీప్, ప్రసాద్‌లు కారులో పాలకొల్లు రిలయెన్స్ బంక్ వద్ద ఆగారు. మరోవైపు, బుజ్జి డ్రైవర్ ఒకరు దగ్గరలో ఉన్నాడు. అక్కాచెల్లెళ్లు పాలకొల్లు నుంచి తిరిగి నరసాపురం వస్తుండగా వీరిని వారిని గుర్తించేలా బుజ్జి కారు డ్రైవర్ సందీప్, ప్రసాద్‌లకు సమాచారం ఇచ్చాడు.

టీడీపీ నేతల అరెస్టుతో

టీడీపీ నేతల అరెస్టుతో

వారి బండి దిగమర్రు గ్రామంలోకి వస్తుండగా వారు కారుతో ఢీకొట్టారు. ప్రమాదం జరిగినట్లుగా సృష్టించారు. ఈ ఘటనలో శ్రీగౌతమి మృతి చెందగా, పావని గాయాలతో బయటపిడంది. తొలుత దీనిని ప్రమాదంగా భావించారు. ఆ తర్వాత పావని, తల్లి కుట్రపూరితంగా జరిగిన హత్యగా ఆరోపించారు. ఏడాదిన్నర తర్వాత టీడీపీ నేతలను అరెస్టు చేయడం నరసాపురంలో సంచలనంగా మారింది.

శ్రీగౌతమితో రహస్య వివాహం

శ్రీగౌతమితో రహస్య వివాహం

శ్రీగౌతమి ఎంబీయే పూర్తి చేసి సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగి చనిపోయింది. అప్పుడు పావని మండల పరిషత్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌లో పని చేశారు. తండ్రి గతంలో సజ్జా బుజ్జి దుకాణంలో పని చేశారు. అతను కొంతకాలం క్రితం మృతి చెందారు. తండ్రి సజ్జా బుజ్జి దుకాణంలో పని చేసిన సమయంలో శ్రీగౌతమికి, అతనికి పరిచయం ఏర్పడింది. బుజ్జికి అప్పటికే పెళ్లయింది. భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. శ్రీగౌతమిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిశాక కుటుంబంలో గొడవలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా గౌతమిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పోలీసులు దీనిని రోడ్డు ప్రమాదంగా చెప్పి తొలుత కేసు మూసేసినా, సోదరి పావని పోరాటం, సీఐడీ జోక్యంతో విచారణలో హత్యగా తేలింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police arrested four out of the seven suspects, including the husband of Dangeti Sri Gowthami (24), who was allegedly fatally knocked down on the town outskirts, 18 months ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more