• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓరి సన్నాసి అదేం పద్దతిరా..? భార్యను బెదిరించడానికి అదేం బ్లాక్ మెయిల్ రా యెదవా..??

|

చిత్తూరు/హైదరాబాద్ : కొన్ని జీవితాలు విచిత్రంగా సాగుతుంటాయి. కష్టాల కడలినుండి బయటపడేందుకు ప్రాంతం మారినా, వ్యక్తుల్ని మార్చుకున్నా, సమాజానికి దూరంగా ఉన్నా, ఆఖరికి స్వభావం మార్చుకున్నా కష్టాలు, కన్నీళ్లు మాత్రం వారి జీవితంలో మారవు. ఫెవికాల్ బందం లా అంటిపెట్టుకునే ఉంటాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ మహిళ పాలిట శాపంగా పరిణమించింది. ఓ భర్త వేధింపులు తట్టుకోలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది.

ఇప్పటికే కొన్ని విబేధాల వల్ల మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న ఆమెకు రెండో పెళ్లి చేసుకున్నాక కూడా కస్టాలు తప్పడం లేదు. మరింత కట్నం తీసుకురాకుంటే మనం ఏకాంతంగా గడిపిన వీడియోలు బయటపెడతా అంటూ బెదిరించడంతో పోలీసులను తప్పక ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణి పట్టణానికి చెందిన లేడీ డాక్టర్‌కు గతంలో వివాహమై విబేధాలతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఆమె రెండో వివాహం చేసుకుంది. పెళ్లయిన కొత్తలో సఖ్యతగానే ఉన్న భర్త ఆ తర్వాత తన వికృత రూపం ప్రదర్శించాడు.

Husband blackmail wife to realease nude pics if not bring money..!

మొదట కొన్ని లక్షల కట్నం తీసుకున్నప్పటికీ మరింత కట్నం తీసుకురావాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ దంపతులు ఏకాంతంగా గడిపిన సమయంలో సెల్‌ఫోన్లో వీడియో తీసుకున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న భర్త పుట్టింటి నుంచి 10లక్షల రూపాయలు తీసుకురాకపోతే ఆ వీడియోను ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు.

అలా చేయొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా భర్త వినిపించుకోకపోవడంతో చివరికి పోలీసులకు ఆశ్రయించింది. భర్తపై ఆరణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచిన తర్వాత నిందితుడిని వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At first the husband took a few lakh dowry but he was harassing her for more dowry. Against this backdrop, the couple took a video on their cellphone while they were alone. The husband who played it as an opportunity threatened to upload the video on the Internet if she did not bring Rs 10 lakh from her birthplace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more