• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

యువకుడి దారుణ హత్యకు దారితీసిన ఛాటింగ్:భార్యతో సరసాలు ఆడుతున్నాడని భర్త ఘాతుకం

By Suvarnaraju
|

విజయవాడ:ఫేస్‌బుక్‌ పరిచయం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. తన భార్యతో ఛాటింగ్ చేయడమే కాకుండా వారిద్దరూ కలసి సెల్ఫీలు దిగడం చూసి తట్టుకోలేని ఆమె భర్త తన స్పేహితులతో కలసి ఆ యువకుడిని చిత్రహింసలు పెట్టి కొట్టి కొట్టి చంపారు.

విజయవాడ నగరంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మరోవైపు తన భర్త కనిపించడం లేదంటూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో ఈ దారుణ హత్య విషయం వెలుగు చూసింది. ఈ ఉదంతాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని స్త్రీ పురుషులు సోషల్ మీడియా పట్ల, వివాహేతర సంబంధాల విషయంలోనూ సరైన ప్రవర్తన కలిగిఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...కృష్ణలంక బియ్యపుకొట్టు బజారుకు చెందిన లంకా నాగ వెంకట సీతారామాజంనేయశర్మ బాలాజీనగర్‌లో ఉన్న పాత ఆంజనేయస్వామి ఆలయంలో పురోహితుడిగా పనిచేసేవాడు.

 Husband kills wife’s ‘social media friend’

అదే ఆలయానికి వెళ్లే మౌనిక అనే వివాహితకు సీతారామాజంనేయశర్మ కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను పంపగా...దీన్ని ఆమె ఓకే చేసింది. మరోవైపు మౌనిక నాలుగేళ్ల క్రితమే తేలప్రోలుకు చెందిన కలతోటి సాయిశ్రీనివాస్‌ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. సాయి శ్రీనివాస్ గవర్నరుపేటలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో సెల్ ఫోన్ రిపేరు షాపు నిర్వహించేవాడు. మౌనిక,సాయి శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇదిలావుండగా సీతామారాంజనేయశర్మతో మౌనికకు ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకునే వరకు వెళ్లింది. ఆ తరువాత వీరిద్దరూ వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో చాటింగ్‌‌లు చేసుకోవడం, ఫొటోలను పోస్ట్‌ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇది హద్దు మీరిపోయి రేయింబవళ్లు అదే పిచ్చిలో ఉండేవారు. ఈ క్రమంలో
మౌనిక భర్త సాయిశ్రీనివాస్‌ ఈనెల 14న భార్య మౌనిక సెల్‌ఫోన్‌ చూశాడు. అందులో భార్యతో సీతారామాంజనేయ శర్మతో చేసిన చాటింగ్‌లు...అసభ్యకరమైన ఫొటోలు, సందేశాలు చూసి షాక్ తిన్నాడు.

వెంటనే సీతారామాంజేయశర్మకు ఫోన్‌ చేసిన సాయిశ్రీనివాస్‌...''రేపు (15వ తేదీ) ఉదయం మర్యాదగా ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ వద్దకు రా...లేకపోతే ఇంటికొచ్చి నీ బండారం బైటపెడతా'' అని బెదిరించాడు. దీంతో శర్మ 15వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తానని చెప్పాడు. ఆ ప్రకారమే ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లోని శ్రీనివాస్‌ మొబైల్‌ షాపు వద్దకు వెళ్లాడు శర్మ...అతడిని సాయిశ్రీనివాస్‌, అతడి స్నేహితులు కలిసి భవనంపైకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. తర్వాత సెల్లార్‌లోకి తీసుకొచ్చి మళ్లీ కర్రలతో కొట్టారు. ఈ క్రమంలో శర్మ జేబులో ఉన్నసెల్‌ఫోన్‌ కిందపడింది. ఆ ఫోన్ తీసుకున్న సాయి శ్రీనివాస్ అందులో ఫోటో గ్యాలరీ పరిశీలించగా రాజీవ్‌గాంధీ పార్కులో మౌనికతో శర్మ కలసివున్న ఫొటోలు కనిపించాయి.

దీంతో సాయిశ్రీనివాస్‌ మరింత ఆగ్రహానికి లోనై అతడిని తనతో రమ్మని...నిన్ను తేలప్రోలులో ఉంటున్న తన బావ మరిది పుట్టిన రోజు వేడుకలు అయిన తర్వాత వదిలేస్తానని చెప్పి బైక్ పై ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్లారు. ఆ రాత్రికి మళ్లీ అక్కడ చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టడంతో శర్మ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి మృతదేహాన్ని తీసుకొచ్చి జాతీయ రహదారిక పక్కన పడేసి వెళ్లిపోయారు.

అయితే భర్త ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో శర్మ భార్య స్వరూప కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఎవరో అమ్మాయితో చాటింగ్‌ చేస్తున్నాడని, ఆమె భర్తే తన భర్తను ఏదో ఒకటి చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో 16వ తేదీన ఈ మృతదేహాన్ని చూసిన గన్నవరం పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి శవంగా నమోదుచేసుకున్నారు.

మరోవైపు కృష్ణలంక పోలీసులు శర్మ కాల్‌డేటాను విశ్లేషించి, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మౌనిక భర్త సాయిశ్రీనివాస్‌తోపాటు శర్మ హత్యకు సమకరించిన డాకారపు సాయిశ్రీనివాస్‌, మెహ్మద్‌ సర్వర్‌, తమ్మిన విజయ బాబు, లక్కసాని సతీష్‌, షేక్‌ ఫరూఖ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ సోమవారం మీడియాకు వెల్లడించారు.

English summary
Vijayawada: Four persons, including the husband of a woman, were taken into custody for allegedly killing a person, who was reportedly chatting with the woman on a social media.The deceased, Ramanjaneya Sharma (36), was missing for the last two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X