దేశంలో తొలిసారి: గర్భస్థ శిశువుకు సర్జరీ (పిక్చర్స్)
హైదరాబాద్: తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ శిశువు గుండెకు శస్త్రచికిత్స జరిగిపోయింది. గర్భస్థ శిశువు గుండెలో పూడుకుపోయిన రక్తనాళాన్ని సరిచేసిన అరుదైన ఘనతను హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి వైద్యులు దక్కించుకున్నారు. రోజురోజుకూ కుచించుకుపోతున్న 26 వారాల వయసున్న గర్భస్థ శిశువు గుండె గదికి చికిత్స చేసి కొత్త ఊపిరి పోశారు.
దేశంలోనే మొట్టమొదటి ‘ఫీటల్ హార్ట్ ఆపరేషన్' ఇది. ఈ చికిత్స జరిగిన తీరును ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు, హృద్రోగ నిపుణులు నాగేశ్వరరావు గురువారం మీడియాకు వివరించారు. రంగారెడ్డి జిల్లా ఇజ్జాపూర్లో ఓ ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న శిరీష(25) రెండోసారి గర్భం దాల్చినప్పుడు స్కానింగ్ చేయగా.. ఆమె కడుపులో ఉన్న శిశువు గుండె పెరుగుదలలో లోపాలు కనిపించాయి.
ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఆమె కేర్ ఆస్పత్రి హృద్రోగ నిపుణులను సంప్రందించారు. 23 వారాల సమయంలో స్కానింగ్ చేయగా, శిశువుకు అయోర్టిక్ వాల్వ్ పూర్తిగా బ్లాక్ అయినట్లు తేలింది. అలాగే, గుండె గదుల్లో ఒకటి కుచించుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని శిరీష దంపతులకు చెప్పి చికిత్స చేశారు. అక్టోబర్ 31 గర్భస్థ శిశు దినోత్సవం కావడం గమనార్హం.

గర్భస్థ శిశువుకు సర్జరీ
అమ్మ కడుపులోని 25 వారాల శిశువు గుండెకు చికిత్సనందించేందుకు వైద్యులు ఉపక్రమించారు. అయితే ఆ సమయంలో కడుపులో శిశువు కదలికలు ఎక్కువగా ఉండడంతో విరమించుకున్నారు.

గర్భస్థ శిశువుకు సర్జరీ
అప్పుడు వైద్యులు విరమించుకోవడంతో శిరీష దంపతుల్లో ఆవేదన చోటు చేసుకుంది. అయితే గర్భస్థ శిశువుకు 26 వారాల సమయంలో మరోసారి వైద్యులు చికిత్సకు ప్రయత్నించారు.

గర్భస్థ శిశువుకు సర్జరీ
ముందుగా శిరీషకు జనరల్ అనస్తీషియా ఇచ్చారు. ఆ తరువాత కడుపులో ఉన్న బిడ్డ తొడపై ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్ ఇచ్చి శిశువు కదలికలను నివారించారు.

గర్భస్థ శిశువుకు సర్జరీ
శిశువు కదలికలను నివారించి ప్రత్యేకంగా శిశువు కోసం తయారు చేసుకున్న బెలూన్ అమర్చిన సన్నని నీడిల్‌ను శిరిష కడుపు ద్వారా గర్భస్థ శిశువు ఛాతీ మీదుగా గుండెలోకి చొప్పించారు. తరువాత అయోర్టిక్ వాల్వ్‌ను బెలూన్ సాయంతో తెరిచి అందులో బ్లాక్‌ను క్లియర్ చేశారు.

గర్భస్థ శిశువుకు సర్జరీ
మాల్జిని, కామశ్రీ, సాయిలీల, జగదీష్, పీబీఎస్ గోపాల్, విద్యాసాగర్, కమల సహా 12 మంది వైద్యులు, మరో 10 మంది సిబ్బంది రెండున్నర గంటల పాటు శ్రమించి శిశువుకు శస్త్రచికిత్స పూర్తి చేశారని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.

గర్భస్థ శిశువుకు సర్జరీ
చికిత్స జరిగిన రెండు రోజులకు శిరీషను డిశ్చార్జ్ చేశారు. ఈ చికిత్స వ్యయాన్ని కేర్ ఫౌండేషన్ భరించిందని డాక్టర్ నాగేశ్వరరావు చెప్పారు.

ఇలా అభినందన
శరీష కడుపులోని శిశువు గుండెకు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఆమెను అభినందిస్తూ ఇలా...

కేర్ ఆస్పత్రి వైద్య బృందంతో..
తన గర్భస్థ శిశువు గుండెకు శస్త్రచిక్సత్స చేయించుకున్న శిరీష్ కేర్ ఆస్పత్రి వైద్యుల బృందంతో ఇలా కనిపించారు.