• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జెసికి షాక్: 'దివాకర్ ట్రావెల్స్‌లో ఇలా జరిగితే అనుమతిస్తారా?'

By Narsimha
|

హైదరాబాద్: అనంతపురం టిడిపి ఎంపీ జెసి దివాకర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. విమాయానసంస్థలు తనపై నిషేధం విధించడాన్ని సవాల్‌చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం నాడు కీలకవ్యాఖ్యలు చేసింది.దివాకర్ ట్రావెల్స్‌లో ఇలాంటి ఘటనలు జరిగితే అనుమతిస్తారా అని జేసీని కోర్టు ప్రశ్నించింది.తదుపరి విచారణను ఈ నెల 21వ, తేదికి వాయిదా వేసింది.

జెసి దివాకర్‌రెడ్డికి బాబు షాక్: ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందే

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాత్కాలికంగా తనపై విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తివేయాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే విమానయాన సంస్థల వాదనలు వినకుండా ఆర్డర్ ఇవ్వడం కుదరని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

కాగా, తనపై దేశీయ విమానయానసంస్థలు నిషేధం విధించడం న్యాయసూత్రాలకు విరుద్దమని జేసీ దివాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించేందుకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు.

జూన్ 15న, విశాఖపట్టణం విమానాశ్రయంలో ఆలస్యంగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో బోర్డింగ్ పాస్ నిరాకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో జేసీ గొడవపడ్డారు.

షాక్: విమానం ఎక్కించుకొనేది లేదన్న ట్రూజెట్, వెనుదిరిగిన జెసి దివాకర్‌రెడ్డి

దివాకర్ ట్రావెల్స్‌లో అనుమతిస్తారా?

దివాకర్ ట్రావెల్స్‌లో అనుమతిస్తారా?

ప్రయాణానికి అనుమతిచ్చేలా విమానాయాన సంస్థలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయమై హైకోర్టు విచారణ జరిపింది. విమానయాన సంస్థలు నిబంధనలను కఠినంగా అమలు చేయకపోతే ప్రయాణీకుల భద్రత, రక్షణ ఎలా సాధ్యమౌతోందని కోర్టు ప్రశ్నించింది. పార్లమెంట్ సమావేశాలున్నందున వీలైనంత త్వరగా విచారణ జరిపేందుకు వీలుగా నోటీసులను స్పీడ్ పోస్ట్, మెయిల్ ద్వారా పంపేందుకు హైకోర్టు అనుమతిచ్చింది.

  J. C. Diwakar Reddy Revealed Facts About YS Jagan Delhi Tour
  స్నేహితుడి విమానంలో ఢిల్లీకి జేసీ

  స్నేహితుడి విమానంలో ఢిల్లీకి జేసీ

  రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకుగాను అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి తన స్నేహితుడి విమానంలో ఢిల్లీకి సోమవారం నాడు చేరుకొన్నారు. విమానసంస్థలు జేసీపై నిషేధం విధించాయి. దీంతో ఆయన తన స్నేహితుడి విమానంలో ఆయన సోమవారం నాడు ఢిల్లీకి చేరుకొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన తన ఓటుహక్కును వినియోగించుకొన్నారు. వారంరోజుల క్రితం విజయవాడకు వెళ్ళేందుకు జెసి దివాకర్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుండి తిరిగిరావాల్సిన పరిస్థితి వచ్చింది.

  దురృష్టకరమైన ఘటన

  దురృష్టకరమైన ఘటన

  ఈ ఏడాది జూన్ 15వ, తేదిన విశాఖపట్టణం ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకొన్న ఘటనను దురదృష్టకరమైన ఘటనగా జేసీ తరపున న్యాయవాది కోర్టులో చెప్పారు.ఇండిగో విమానానికి బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించడంతో ఆయన ప్రింటర్‌ను ఎత్తేసి హంగామా చేశారు. దీంతో విమానాయనసంస్థలు ఆయనపై ట్రావెల్‌బ్యాన్‌ను విధించాయి..అయితే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని చంద్రబాబునాయుడు జెసికి సూచించారు. ఈ మేరకు కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు సహయం తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.

  విమానాయానసంస్థలకు నోటీసులు

  విమానాయానసంస్థలకు నోటీసులు

  పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ట్రావెల్ బ్యాన్ అంశాన్ని తేల్చాలని జెసి తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ట్రావెల్‌బ్యాన్‌ను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించలేదు. అయితే విమానాయానసంస్థల వాదనలను కూడ వినాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఈ నెల 21న, హజరుకావాలని కేంద్ర పౌరవిమానాయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి, డిజిసిఏ, ఎయిరిండియా, జెట్‌ఎయిర్‌వేస్, విస్తారా, ఎయిర్‌లైన్స్, గో ఎయిర్, ఎయిర్ఏషియా, స్పైస్‌జెట్, మెగా ఎయిర్‌వేస్ సంస్థలకు నోటీసులు జారీచేసింది హైకోర్టు. ఈ నెల 21న ఈ కేసు విచారణ జరగనుంది.

  English summary
  Hyderabad highcourt shocking comments on Anantapur MP Jc Diwakar reddy on Monday. The High Court has disappointed Anantapur MP JC Diwakar Reddy who filed a petition over domestic airlines adding him to their No-Fly list. “Will you allow such passengers if such incident happens in Diwakar Travels?” the court questioned.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more