వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 లక్షల మందితో హైదరాబాద్‌ను ముట్టడిస్తాం: అశోక్

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: విభజనకు వ్యతిరేకంగా పది లక్షల మందితో హైదరాబాద్‌ను ముట్టడిస్తామని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. అనంతపురంలో సోమవారం జరిగిన లేపాక్షి బసవన్న రంకె పేరుతో ఏర్పాటైన సమైక్యాంధ్ర సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాదును వదులుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. విభజన కావాలంటే తెలంగాణవాళ్లు హైదరాబాదును వదిలేసి వేరే రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు.

సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలతో సీమాంధ్ర ప్రజలు హైదరాబాదులో మమేకం కావాల్సిన అవసరం ఉందని, అందుకు మన సంస్కృతిని మార్చుకోవాలని ఆయన అన్నారు. కలయికలో నిజాయితీ ఉండాలని ఆయన అన్నారు. తాము తెలంగాణ ఉద్యోగులతో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు కూడా అలా కలవాలని ఆయన అన్నారు. మన నాయకులు రాజ్యాధికారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉంటే విభజన ఆగిపోతుందని ఆయన అన్నారు.

 Ashok Babu

రాష్ట్ర విభజనలో పాలు పంచుకున్నా, సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనకపోయినా సీమాంధ్ర రాజకీయ నాయకుల భవిష్యత్తు ముగుస్తుందని ఆయన అన్నారు. తాము ఓటు వేసింది రాష్ట్రాన్ని పాలించాలని గానీ విడదీయాలని కాదని ఆయన అన్నారు. రాజకీయ నాయకులను ఓటుతోనే కొట్టగలమని ఆయన అన్నారు. రాయలసీమ పూర్తిగా వెనకబడిపోయిందని, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా తప్ప ఏదీ వెనకబడి లేదని ఆయన అన్నారు. తాము తలలు ఎగిరేసి చేతులు బయటపెట్టిన రోజు తమను ఏ శక్తీ ఆపలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను ఆపడానికి ఉద్యోగ సంఘాలు చేయగలిగినంత చేస్తున్నాయని అన్నారు.

2014 ఎన్నికల్లో రాజకీయ మార్పులు రావడం ఖాయమని అన్నారు. తెలంగాణ బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత సీమాంధ్ర శాసనసభ్యులపై ఉందని అశోక్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అవాకులు చవాకులు మానుకోవాలని ఆయన సూచించారు. మన ఆవేశాన్ని ఒడిసిపట్టాలని, సుదీర్ఘంగా ఉద్యమించాల్సి ఉందని, 2019 వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విడిపోదని తేలినప్పుడే విశ్రాంతి తీసుకోవాలని ఆయన అన్నారు.

ఎండ, వాన, ఆకలిదప్పులు ఉద్యమాన్ని ఆపలేవని ఆయన అన్నారు. విద్యార్థులకు సామాజిక బాధ్యతను నేర్పాల్సిన అవసరం ఉందని, తెలంగాణ విద్యార్థులు సామాజిక బాధ్యతను ఎరిగి ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఉపాధ్యాయులే సామాజిక బాధ్యతను బోధించాలని ఆయన అన్నారు.

English summary
AP NGOs president Ashok Babu warned that Hyderabad muttadi will be taken up with 10 lakh people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X