వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ష‌ర్మిళ పై అస‌భ్య ప్ర‌చారం వీరి ప‌నే : నిందితుల గుర్తింపు : సూత్ర‌ధారి ని గుర్తించిన పోలీసులు..!

|
Google Oneindia TeluguNews

వైసిపి అధినేత జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ పై అస‌భ్య పోస్టులు పెట్టిన కేసులో సూత్ర‌ధారుల‌ను పోలీసులు గుర్తించారు. ఇప్ప టికే పులువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దీని వెనుక అస‌లు వ్య‌క్తుల గురించి ఆరా తీసారు. ఆ స‌మ‌యం లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు లోకి వ‌చ్చాయి. కీల‌క సూత్ర‌ధారిని పోలీసుల అరెస్ట్ కు రంగం సిద్దం చేసారు. అదే విధంగా వీటి వెనుక ఉన్న వెబ్‌సైట్ల‌ను గుర్తించారు.

Hyderabad Police identified accused in Sharmila case: Notices issued..

సూత్ర‌ధారుల గుర్తింపు..
వైఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెట్టిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు సూత్రధారులను పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వైఎస్‌ షర్మిల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా అనుచిత వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన అస లు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో యూట్యూబ్‌ చానల్‌ అవుట్‌ అండ్‌ మ్యాంగో గ్రూప్‌ ఎండీ ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారించిన త‌రువాత ఆయ‌న్ను అదుపులోకి తీసుకొనే అవ‌కాశాలు ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ష‌ర్మిళ పై పోస్టింగ్ లు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసారు.

<strong>కులం కావాలా...నీళ్లు కావాలా : ఒక్క కులం వారికే ఇచ్చానా : ఏపి ఎన్నిక‌ల్లో కుల పాట్లు...!</strong>కులం కావాలా...నీళ్లు కావాలా : ఒక్క కులం వారికే ఇచ్చానా : ఏపి ఎన్నిక‌ల్లో కుల పాట్లు...!

వెబ్‌సైట్ల‌ను గుర్తించిన పోలీసులు
ఇక‌, ఇదే కేసులో వీడియో లు పోస్ట్ చేసిన వెబ్‌సైట్ల పాత్ర పైనా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. అందులో భాగంగా..టీఎఫ్‌సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌, టాలీవుడ్‌ నగర్‌, చాలెంజ్‌ మంత్ర వెబ్‌సైట్ల పాత్ర కూడా ఉన్నట్టు వెల్లడైంది. టీఎఫ్‌సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ కార్యాలయం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లో ఉన్న ఎన్‌బీకే బిల్డింగ్‌లో ఉంది. ఎన్‌బీకే భవనం నందమూరి బాలకృష్ణకు చెందినది. వైఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనుక టీడీపీ నాయకుల హస్తమున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేశారు. కొంతమంది పరారీలో ఉన్నారు. రెండు మూడు రోజుల్లో సూత్రధారులను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశముందని చెబుతున్నారు. హైద‌రాబాద్ పోలీసుల‌కు షర్మిల చేసిన ఫిర్యాదు ఆధారం గా ఈ కేసు విచార‌ణ వేగంగా సాగుతుంది.

English summary
Hyderababd Police identified accused in Sharmila case. Police arrested who posted postings in social media on Sharmila. Now, police traced that you tube channels also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X