హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంక్రాంతి: సేద దీరిన హైదరాబాద్ రోడ్లు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ రోడ్లు సేద దీరినట్లుగా కనిపించాయి. ట్రాఫిక్ రద్దీతో, హారన్ల మోతతో నిత్యం హోరుపెట్టే హైదరాబాద్ రోడ్లు ఖాళీగా కనిపించాయి. వాహనాల తాకిడి, ప్రజల పదఘట్టనలు లేక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రోడ్లు సేద దీరినట్లుగా కనిపించాయి. సంక్రాంతికి ముందు శనివారం, ఆదివారం రావడంతో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్న సమయంలో రోడ్లు ఖాళీ కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సాయంత్రం, శనివారంలో హైదరాబాదులోని ప్రజలు పల్లెబాట పట్టారు. ఆ రెండు రోజులు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా కనిపించాయి.

మకర సంక్రాంతి మంగళవారంనాడేనని తొలుత భావించారు. అయితే, అది బుధవారంనాటికి, అంటే 15వ తేదీకి మారింది. దీంతో బుధవారం కూడా హైదరాబాద్ రోడ్లు ప్రజల తొక్కిడి లేక నిర్మానుష్యంగా కనిపించాయి. ఉన్న కొద్ది పాటి వాహనాలు హాయిగా రోడ్ల మీద నడుస్తూ కనిపించాయి. ఆర్టీసి బస్సులు కూడా ఖాళీగా కనిపించాయి.

హైదరాబాద్ ఖాళీ 1

హైదరాబాద్ ఖాళీ 1

సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ ఖాళీ కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. నిత్యం ట్రాఫిక్‌తో, హారన్ల మోతతో తల్లడిల్లే రోడ్లు సేద తీరుతున్నట్లుగా కనిపించాయి.

హైదరాబాద్ ఖాళీ 2

హైదరాబాద్ ఖాళీ 2

హైదరాబాద్ రోడ్లపై విసిరేనినట్లుగా ఇప్పుడో ఆటో, అప్పుడో కారు నడిచాయి. వాహనచోదకులు హాయిగా ఫీలయ్యారు.

హైదరాబాద్ ఖాళీ 3

హైదరాబాద్ ఖాళీ 3

హైదరాబాద్ రోడ్లు ఇలా నిర్మానుష్యంగా కనిపించాయి. హైదరాబాదు రోడ్లు ఇంత ఖాళీగా కనిపించడం చాలా అరుదైన విషయం.

ఏం హాయిలే హలా..

ఏం హాయిలే హలా..

రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి వాహనదారులు హైదరాబాదు రోడ్లపై ఏమి హాయిలే హలా అనుకుంటూ వాహనాలను నడిపినట్లున్నారు.

ముఖ్యమైన కూడళ్లు కూడా..

ముఖ్యమైన కూడళ్లు కూడా..

హైదరాబాదులోని ముఖ్యమైన కూడళ్లు కూడా వాహనాల రొదకు దూరమయ్యాయి. అప్పుడో వాహనం ఇప్పుడో వాహనం రోడ్డుపై వెళ్తూ కనిపించాయి.

నగరం నిద్రపోయింది..

నగరం నిద్రపోయింది..

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ లేకపోవడంతో హైదరాబాద్ నగరం నిద్రపోతోందా అనిపించే వాతావరణం నెలకొంది.

English summary
During Sankranthi festival Hyderabad raods have witnessed a deserted look, as public went to their native places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X