హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికా నుంచి పీఛే ముడ్: హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా నుంచి హైదరాబాదులోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 15 మంది విద్యార్థులు తిరిగి వచ్చారు. 15మంది తెలుగు విద్యార్థులు ఉన్నతచదువుల కోసం అమెరికా వెళ్లారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా అమెరికా అధికారులు వారిని వెనక్కి పంపారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

సియాటెల్‌ వర్సిటీలో తమను బంధించారంటూ విద్యార్థులు ఆరోపించారు. అమెరికాలో తాము నరకం అనుభవించామని విద్యార్థులు ఆవేదనగా చెప్పారు. న్యూయార్క్ నుంచి 22 మంది భారత విద్యార్థులను వెనక్కి పంపగా, 15 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

 Hyderabad students fly back after deportation

న్యూయార్క్ విమానాశ్రయం నుంచే వారిని వెనక్కి పంపించారు. అయితే, తమను ఎందుకు వెనక్కి పంపుతున్నారనే విషయాన్ని అధికారులు వెల్లడించ లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

తమను భయపెట్టే విధంగా అధికారులు వ్యవహరించారని అన్నారు. మళ్లీ వీసా తీసుకుని తిరిగి రావచ్చునని అధికారులు చెప్పారు. తెలుగు విద్యార్థుల పట్ల అమెరికా అధికారులు వివక్ష ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు.

English summary
15 Telugu students have returned to Hyderabad Shamashabad airport from New York in USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X