వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు ఎంపీలు ఒంటికి కారం పూసుకోవాలని పవన్ కళ్యాణ్: నేడు హైపర్ ఆది ట్వీట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై టీడీపీ సహా ఏపీకి చెందిన పార్టీలు మండిపడుతున్నాయి. అయితే దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.

20 మంది: వైసీపీ దుష్ప్రచారానికి చెక్ చెప్పేందుకు టీడీపీ 'సైన్యం' సిద్ధం20 మంది: వైసీపీ దుష్ప్రచారానికి చెక్ చెప్పేందుకు టీడీపీ 'సైన్యం' సిద్ధం

ప్రతి విషయంలోను సమయం, సందర్భం చూసుకొని పవన్ స్పందిస్తారు. బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరగలేదని విమర్శలు వ్యక్తమవుతున్నా... బడ్జెట్ ఆమోదం వరకు లేదా మరికొన్నాళ్లు ఆయన ఆగి ఆ తర్వాత బీజేపీని ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఆయన ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై మండిపడుతున్నారు.

నాడు పవన్ కళ్యాణ్ అన్న మాటలను

బడ్జెట్‌పై పవన్ కళ్యాణ్ స్పందించకపోయినప్పటికీ ఆయన అభిమాని, జబర్దస్త్ హైపర్ ఆది గతంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలను ట్వీట్ చేశారు. ఏడాదిన్నర క్రితం ఏపీ ఎంపీలపై వవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని ఇప్పుడు హైపర్ ఆది ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్, నటుడు నిఖిల్

పవన్ కళ్యాణ్, నటుడు నిఖిల్

'పౌరుషంలేని పార్లమెంటు సభ్యులారా ఒంటికి కారం రాసుకోండి, గర్జించిన పవన్ కళ్యాణ్' అని హైపర్ ఆది ట్వీట్ చేశారు. అంతేకాదు, నటుడు నిఖిల్ ప్రత్యేక హోదాకు మద్దతు పలికుతూ పెట్టిన ట్వీట్‌ను కూడా మరో ట్వీట్‌లో పొందుపర్చారు. నిఖిల్ స్పందించిన తీరును హైపర్ ఆది ప్రశంసించారు.

Recommended Video

Jabardasth Hyper Aadhi Issue : Opinion
కాకినాడ ఆత్మగౌరవ సభలో

కాకినాడ ఆత్మగౌరవ సభలో

నాడు పవన్ కళ్యాణ్ కాకినాడ ఆత్మగౌరవ సభలో మాట్లాడుతూ.. పౌరుషం లేని ఎంపీలు ఒంటికి కారం పూసుకోవాలని విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ లేదు, పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చారని, వాటిని తీసుకోవడం ఏమిటని నిలదీశారు. జనసేన మాత్రం ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. కాగా, హోదా ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేదో ప్రజలను మెప్పించేలా సమాధానం ఉండాలని కూడా పవన్ ఆ తర్వాత సూచన చేశారు.

 వామపక్షాల నిరసనలకు వైసీపీ మద్దతు

వామపక్షాల నిరసనలకు వైసీపీ మద్దతు

ఇదిలా ఉండగా, బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని చెబుతూ, ఏపీకి ఇచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చలేదని చెబుతూ ఈ నెల 8వ తేదీన వామపక్షాలు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనలకు వైసీపీ మద్దతు తెలిపింది. ఏపీ ప్రయోజనాల కోసం తాము ఎవరికైనా మద్దతు తెలుపుతామని పేర్కొంది.

English summary
Jabardast Hyper Aadi tweeted Jana Sena cheif Pawan Kalyan statement on Special Status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X