వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతివైపు దారి.. అందరూ బయటకొస్తారు: పవన్ సంచలనం, టీవీ9 రవిప్రకాశ్‌కు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారని భావిస్తున్న టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల అస్త్రం కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా ఆయన టీవీ9పై వరుస ట్వీట్లతో గట్టి షాకిచ్చే ప్రయత్నం చేశారు. ఉదయం ఏడు గంటల తర్వాత నుంచి తన ట్వీట్లను వరుసగా పెడుతూ వచ్చారు.

Recommended Video

'బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదూసి కొడదాం ' :ఆర్. కే. పై పవన్ విజ్రుమ్భాన

తద్వారా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలపై తన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్నారు. మంగళవారం ఉదయం టీవీ9 అధినేత శ్రీనిరాజు, సీఈవో రవిప్రకాశ్‌పై విరుచుకుపడిన పవన్ ఆ తర్వాత కాసేపటికే మరో సంచలన ట్వీట్ చేశారు.

నా దగ్గర ఇలాంటివి కుదరదు: పవన్ వార్నింగ్, శ్రీరెడ్డికి ఝలక్, ఆ టీవీ ఛానల్స్ ఎందుకు చూడాలి?నా దగ్గర ఇలాంటివి కుదరదు: పవన్ వార్నింగ్, శ్రీరెడ్డికి ఝలక్, ఆ టీవీ ఛానల్స్ ఎందుకు చూడాలి?

జాతకాలు బయటకు వస్తాయి, అమరావతి వైపు దారి తీస్తాయి

గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు జరపాలని తెలంగాణ పోలీసులను కోరనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దెబ్బతో తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న పురుషులు, మహిళ జాతకాలు అన్నీ బయటకు వస్తాయని, అది క్రమంగా అమరావతి వైపు దారి తీస్తుందంటూ సంచలన ట్వీట్ చేశారు.

దర్యాఫ్తు చేస్తే ప్రముఖులు బయటకు

దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారి పేర్లు, రాజకీయ నాయకులు, మీడియా పెద్దలు, వారి పిల్లలు ఇలా అందరూ బయటకు వస్తారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలోని కుళ్లు కూడా బయట పడుతుందన్నారు. 'మీరంతా కలిసి నడి రోడ్డుపై ఓ సోదరి బట్టలు ఇప్పించేలా ప్రోత్సహిస్తే దానిని మీడియా చూపించింది. అన్ని షోలకు అది కారణమైందని పవన్ పేర్కొన్నారు.

దేవుడిని నమ్ముతున్నారు

మంగళవారం ఉదయం తొలుత రవిప్రకాశ్ చేసిన పూజలతో ట్విట్టర్లో ట్వీట్లను ప్రారంభించారు. 'రవి గుడ్ మార్నింగ్.. మీరు దేవుడిని, పూజలను కూడా నమ్ముతారు' అని పేర్కొన్నారు.

రవిప్రకాశ్‌కు బహిరంగ లేఖ అంటూ

రవిప్రకాశ్‌ను ఉద్దేశించి మీకు సంబంధించిన కొన్ని ఆర్టికల్స్‌ను ఇస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందులో ఓ ట్వీట్‌లో పోస్ట్ చేసిన దాంట్లో.. మీడియాలో నీలాంటి వ్యక్తులు తప్పులు, అవమానాలు ఏ ఛానల్లో చూపించరని, ఏ పత్రికలో రాయరని, ఇప్పుడు సామాన్యుడి ఆయుధం సోషల్ మీడియా, దాని ద్వారానే నీ అవినీతి అంతర్జాతీయస్థాయి మోసపూరిత వార్తలు ప్రజలకు సాక్షాలతో చూపించానని... ఇలా ఉన్న ఓ పోస్టును పెట్టారు.

మరో మూడు దిమ్మతిరిగే పోస్టులు

మరో మూడు దిమ్మతిరిగే పోస్టులు

రవిప్రకాశ్‌కు బహిరంగ లేఖ అంటూ మరిన్ని పోస్టులు పెట్టారు. అందులో 'జైలు జీవితం వరమే', 'నేను ఉన్మాదిని ఏమిట్రా', 'ఫ్యాక్షన్, ప్రాంతం, కులం' అంటూ ఒకే ట్వీట్లో మరో మూడు పోస్టులు పెట్టారు. అంతేకాదు, మీ 9 గంటల షోలో ఈ ఆర్టికల్స్ వేయి అని సూచన కూడా చేశారు. మీ టీవీ9 అందరికీ అందరికీ సమన్యాయం చేస్తుందని భావిస్తే వీటిని కూడా మీ షోలో వేయాలని, మా పైనే కాదని, వీటిని కూడా వేస్తే అప్పుడు మేం నోరు మూసుకొని కూర్చుంటామని అభిప్రాయపడ్డారు.

English summary
'I am contemplating to request TS police for an investigation into the 6 month slander campaign. I am for sure all the names of these characters both men & women who came out to malign me will be eventually lead to Amaravati.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X