విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసులు మమ్మల్ని విజయవాడలో ఉండనివ్వట్లేదు: ఎత్తుకొచ్చి ఎయిర్ పోర్ట్ లో పడేశారు: రామ్ గోపాల్ వర్మ

|
Google Oneindia TeluguNews

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా విడుదలకు ముందే విజయవాడలో రచ్చ రచ్చ చేస్తోంది. సినిమా ప్రమోషన్ కోసం విజయవాడకు వచ్చిన వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహా, యూనిట్ మొత్తాన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా హోటల్ గదులను ఖాళీ చేయించి, గన్నవరం విమానాశ్రయంలో వదిలేశారు. ఈ ఘటన విజయవాడలో కలకలం పుట్టించింది.

I am In police custody now for the only crime of trying to tell truth, says Ram Gopal Varma

విజయవాడలో ఎక్కడా ఉండటానికి వీల్లేదంటూ హుకుం..

పోలీసులు తమను విజయవాడలో ఉండనివ్వట్లేదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. విజయవాడలో ఎక్కడా ఉండకూడదని ఆదేశించారని చెప్పారు. తాము బస చేసిన హోటల్ గదుల నుంచి బలవంతంగా ఖాళీ చేయించారని, వేరే కార్లల్లో ఎక్కించి విమానాశ్రయానికి తీసుకొచ్చి పడేశారని అన్నారు. తాను, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత ఎంత అడిగినప్పటికీ.. తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాన్ని కూడా వారు చెప్పలేదని అన్నారు. పోలీసులు తమ పట్ల ఎందుకిలా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారనే విషయం తనకు అర్థ కావట్లేదని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.దీనికి సంబంధించిన 46 సెకెన్ల పాటు ఉన్న ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో తీసే సమయానికి ఆయన గన్నవరం విమానాశ్రయంలో ఉన్నారు. అక్కడి నుంచే తాను మాట్లాడుతున్నానని చెప్పారు.

I am In police custody now for the only crime of trying to tell truth, says Ram Gopal Varma

తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వచ్చేనెల 1వ తేదీన ఏపీలో విడుదల కానున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్ కోసం రామ్ గోపాల్ వర్మతో పాటు నిర్మాత, యూనిట్ సభ్యులు మొత్తం విజయవాడకు చేరుకున్నారు. హోటల్ లో బస చేశారు. కొద్దిసేపటికే వారిని ఖాళీ చేయించారు. మరే ఇతర హోటల్ లో గానీ రిసార్టుల్లో గానీ వారికి గదులు దొరకనివ్వకుండా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం నుంచి ఈ విషయంపై విజయవాడలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి తాను విజయవాడ పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నడిరోడ్డు మీద సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడతానంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈలోగానే- విజయవాడ పోలీసులు రామ్ గోపాల్ వర్మ సహా యూనిట్ సభ్యులందర్నీ బలవంతంగా హోటల్ గదులను ఖాళీ చేయించి, ఎక్కడా ఉండటానికి వీల్లేదని అంటూ విమానాశ్రయంలో వదిలేశారు.

English summary
I am In police custody now for the only crime of trying to tell truth, says Movie Director Ram Gopal Varma. He accused that there is no Democracy in Andhra Pradesh. Police unnecessarily took me and my movie Unite members into the Custody, RGV alleged. RGV told that, Hotels in Vijaywada are being warned not to accommodate First Hotel Novotel has cancelled us and now Hotel Ilapuram.This after they have been paid in advance ..The people in power should understand that one can misuse power to delay,but no one can stop truth, He added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X