కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మాటతో వెనక్కి తగ్గిన వెంకటరెడ్డి: అయినా పోటీ తప్పదా!, నామినేషన్ దాఖలు

|
Google Oneindia TeluguNews

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న గౌరు వెంకటరెడ్డి వెనక్కితగ్గారు. దీంతో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాాశాలు కనిపించాయి. అయితే, మరో ముగ్గురు నామినేషన్ వేశారు. ఒకరు బిఎస్పీ అభ్యర్థి దండు శేషుయాదవ్ కాగా, మరొకరు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు, ఇంకొకరు ఎంపీటీసీల సంఘం నాయకుడు జయప్రకాశ్ రెడ్డి. వీరు నామినేషన్ ఉపసహంరించుకుంటే కేఈ ప్రభాకర్ ఏకగ్రీవమవుతారు. రేపు(బుధవారం) నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.

Recommended Video

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు, ట్విస్ట్ లే ట్విస్ట్ లు !

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ట్విస్ట్: జగన్ వ్యతిరేకించినా పోటీకి గౌరు వెంకటరెడ్డి రెడీ, 'మైండ్ గేమేనా?'ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ట్విస్ట్: జగన్ వ్యతిరేకించినా పోటీకి గౌరు వెంకటరెడ్డి రెడీ, 'మైండ్ గేమేనా?'

మొదటి నుంచి ఆసక్తికరంగా సాగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థుల ప్రకటనలోనే ఉత్కంఠకు దారితీశాయి. టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ బరిలో ఉండగా, వైసీపీ తొలుత పోటీ చేయాలనుకుని, తర్వాత విరమించుకుంది.

 జగన్ చెప్పినా వినని..

జగన్ చెప్పినా వినని..

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయదని వైయస్ జగన్ ప్రకటించినప్పటికీ తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని గౌరు వెంకటరెడ్డి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం పెంటగాండ్లలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని వెంకటరెడ్డి కలిశారు.

 జగన్ మాటతో తగ్గిన గౌరు

జగన్ మాటతో తగ్గిన గౌరు

ఈ సందర్భంగా ఎన్నికల్లో తన బలం గురించి జగన్మోహన్ రెడ్డికి 15నిమిషాలపాటు వెంకటరెడ్డి వివరించారు. అయితే, పార్టీ నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జగన్ ఆయనకు స్పష్టం చేశారు. దీంతో గౌరు వెంకటరెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. గౌరు వెంకటరెడ్డి తప్పుకోవడంతో కేఈ ప్రభాకర్ ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి.

నామినేషన్ దాఖలు చేసిన కేఈ

నామినేషన్ దాఖలు చేసిన కేఈ

కాగా, మంగళవారం ఉదయం కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, ఐడీసీ ఛైర్మన్‌ కేఈ ప్రభాకర్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. తన అనుచరులతో కలెక్టరేట్‌కు చేరుకున్న ప్రభాకర్‌ రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

దాదాపు ఏకగ్రీవమైనట్లే

దాదాపు ఏకగ్రీవమైనట్లే

ఇప్పటి వరకు ఆయన ఒక్కరే నామనేషన్ దాఖలు చేయడం గమనార్హం. మంగళవారం సాయంత్రం వరకు సమయం ఉండటంతో మరెవరైనా నామినేషన్ వేస్తే తప్ప.. ఈ ఎన్నిక ఏకగ్రీవమైనట్లే చెప్పవచ్చు. కాగా, ఎన్నికల బరిలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంకా తన నామినేషన్ వేయలేదు.

English summary
YSRCP leader Gouru Venkat Reddy on Tuesday said that he will not contest in Kurnool MLC polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X