వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో చేరికపై స్పందించిన బుట్టా రేణుక

తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలపై కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరబోవడం లేదని, వైసీపీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలపై కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. తాను టీడీపీలో లో చేరుతున్నట్లు వస్తోన్న కథనాలకు తెరదించారు. తనపై ఓ పథకం ప్రకారం ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని రేణుక ఆరోపించారు.

చదవండి: టిిడిపిలోకి బుట్టా రేణుక సహాా ఐదుగురు వైసిపి ప్రజాప్రతినిధులు

తాను తెలుగుదేశం పార్టీలో చేరబోవడం లేదని, వైసీపీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. తాను వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నానని, పార్టీ అధినేతతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆమె తేల్చి చెప్పారు.

kurnool-mp-butta-renuka

మరోవైపు రాయలసీమ నుంచి టిడిపిలోకి భారీగా వలసలుంటాయంటూ టీవీ ఛానెళ్లలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. బుట్టా రేణుకతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరబోతున్నారంటూ కొన్ని వార్తా ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్‌ కూడా ఇచ్చాయి.

జగన్ పాదయాత్ర ప్రారంభించేలోపే పలువురు వైఎస్సార్సీపీ నాయకులు.. తెలుగుదేశం పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరబోతున్నారని, దీనికి సంబంధించి రాయలసీమ ఎంపీలు కొందరు మధ్యవర్తిత్వం వహిస్తున్నారంని ఆయా ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో బుట్టా రేణుక స్పందించి స్పష్టతనిచ్చారు.

English summary
YSRCP Leader, Kurnool MP Butta Renuka given clarity on rumours that she is going to join in TDP soon. On Thursday she told that she is continuing in YCP only and she had good relations with YS Jagan. Earlier some tv channels telecasted Breaking News stating that 3 to 4 YCP leaders are going to join in TDP soon, that too before starting of the YS Jagan Paadayatra. In this scenario.. MP Butta Renuka given clarity on the news about her joing in TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X