• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏ పార్టీలో చేరను, రాజకీయాల్లోకి రాను: లక్ష్మీనారాయణ

By Srinivas
|

Former CBI JD Laxminarayana
హైదరాబాద్: తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మాజీ ఉప సంచాలకులు లక్ష్మీనారాయణ శుక్రవారం అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు.

తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రచారం జరుగుతోందని, అదంతా మీడియా కల్పితాలే అన్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.

కాగా, ఓబుళాపురం గనులు, జగన్ అక్రమాస్తుల వంటి పలు అనేక సంచలనాత్మక కేసులను దర్యాప్తు చేసిన లక్ష్మీనారాయణకు భారతీయ జనతా పార్టీ నుండి పిలుపు వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానించగా, ప్రస్తుతం బిజెపి నాయకులు ఆయనకు గాలం వేసినట్లు ప్రచారం జరిగింది.

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన లక్ష్మీనారాయణ డిప్యుటేషన్‌లో భాగంగా సిబిఐ జెడిగా ఆంధ్రప్రదేశ్‌లో పని చేశారు. డిప్యుటేషన్ ముగిసిన తర్వాత సుమారు తొమ్మిది నెలలపాటు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవలే ఆయనను థానే జాయింట్ కమిషనర్‌గా నియమించింది.

లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌లో వివిద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆయనను సంప్రదించి, తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం బిజెపిలో చేరితే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

English summary
Former CBI JD Laxminarayana on Friday said he is not joining any party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more