వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరిలా కాదు.. నా మార్కు చూపిస్తా: గంటా శ్రీనివాస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను అందరి మంత్రుల్లా కాదని.. తన మార్కు చూపిస్తానని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం లేదని అన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఎలా వస్తుందని చెప్పారు.
విద్యా కమిషన్‌లో నిపుణులతో కమిటీ వేస్తామని చెప్పారు.

ఉపాధ్యాయుల హాజరుకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. తమిళనాడు, కేరళ విద్యావిధానంపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు పని చేస్తే ప్రోత్సాహకాలుంటాయని చెప్పిన గంటా శ్రీనివాస్ రావు.. లేకుంటే పనిష్మెంట్ ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటే యూనియన్లు అడ్డురాకూడదని ఆయన కోరారు. నైతికత అనే అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

I am not like all others ministers: Ganta Srinivas

ఉత్తమ అధ్యాపక అవార్డులు ప్రకటించిన టి ప్రభుత్వం

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల సిబ్బందికి ఉత్తమ అధ్యాపకుల అవార్డులు ప్రకటించింది. విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న 22 మందికి, అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న 12మందికి పురస్కరాలు ప్రకటించింది.

పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడికి కూడా ఈ పురస్కారం లభించింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఎం గోపాల్ రెడ్డి(మైక్రో బయాలజీ ప్రొఫెసర్), ఎం చెన్నప్ప(తెలుగు), ఉత్తమ యువ అధ్యాపకులు పి. సతీష్ కుమార్(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్), తదితరులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

English summary
Andhra Pradesh Minister Ganta Srinivas Rao on Wednesday said that he is not like all others ministres.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X