వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాడుకొని వదిలేశారు.. బాబుకు రివర్స్: ఆ మాట దాటేసిన పవన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చేయిచ్చారా? అంటే ఆయన మాటలను బట్టి అవుననే అర్థమవుతోందని అంటున్నారు. రాజధాని భూసేకరణ తదితర అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ టిడిపి ప్రభుత్వాన్ని గతంలో నిలదీశారు.

అయితే, ఆ తర్వాత ఆయన ప్రశ్నలకు, సూచనలకు చంద్రబాబు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా టిడిపి వైపు ఉన్నట్లుగా కనిపించిందని అంటున్నారు. తాజా తుని విధ్వంసం ఘటనలో మాత్రం పవన్ కళ్యాణ్... పోలీసుల తీరును కూడా తప్పుబట్టారు.

తద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పుబట్టినట్లేనని చెప్పవచ్చు. లక్షలాది మంది వచ్చే సభకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే తుని విధ్వంసం సంఘటన జరిగిందన్నారు. కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తుని ఘటన విషయమై ఇంటెలిజెన్స్ వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తుని ఘటన వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని, సభకు వచ్చిన వారు అలాంటి ఘటనకు పాల్పడరని పవన్ కళ్యాణ్ చెప్పారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

కాపులకు నమ్మకం కలిగించడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తమను ఓటు బ్యాంకులుగానే పార్టీలు వాడుకుంటున్నాయని కాపులు భావిస్తున్నారన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

రైలు అనేది ఒక అగ్గిపుల్ల వేయగానే కాలిపోయేది కాదని, చిన్న ఆడియో వేడుకకే అనేక అనుమతులు తాము తీసుకుంటామని, అలాంటిది లక్షలమంది ఒకచోటకి చేరితే పోలీసులు, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన ఘటన చాలా బాధ కలిగించిందని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

రైలు తగలబెట్టడం వంటి ఘటనలు చూసి బాధ అనిపించిందని. నిన్న ఉదయమే కేరళ వెళ్లాను, షూటింగ్‌ సగంలో ఆపి వచ్చేశానని చెప్పారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

శాంతియుతంగా ఉంటేనే ఉద్యమం విజయవంతం అవుతుందని, ఏ సమస్య అయినా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో తప్పు లేదని కానీ శాంతియుతంగా ఉండలన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఉంటాయి గానీ శాంతియుతంగా ఉంటాయని, అయితే నిన్న జరిగిన ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందని, దీని వెనుక సంఘ విద్రోహకశక్తులు ఉండి ఉంటారని పవన్‌ అనుమానం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఒక లక్ష్యం కోసం ఉద్యమించే వారికి ఉద్యమ అజెండా తప్పనిసరిగా ఉండాలని, అది తప్పుగా ఉండే చరిత్ర క్షమించదని ముద్రగడ పద్మనాభంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఉద్యమ నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తాను జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చానని, 50 శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వాలంటే కచ్చితంగా కమిషన్ వేయాలన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని, ఎన్నికల సమయంలో ఈ వివరాలు చెప్పకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమయిందన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండును మీరు సమర్థిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ సూటిగా సమాధానం చెప్పలేదు. కులం కోసం కాదు ప్రజల కోసం తాను ఉద్యమిస్తానని చెప్పారు.

English summary
Jana Sena chief and film star Pawan Kalyan, with whose help the ruling TDP is believed to have succeeded in wooing the numerically strong Kapus in the reorganised Andhra Pradesh during 2014 general polls to capture power, following the unexpected turn of Kapu Garjana into a violent movement, held a press conference to address the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X