వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా ఉపసంహరించుకుంటున్నా.. ప్రాణమున్నంత వరకు టీడీపీలోనే : బొజ్జల

ఎమ్మెల్యే ప‌ద‌వికి చేసిన‌ రాజీనామాను తాను ఉప‌సంహ‌రించుకుంటున్నానని, ప్రాణమున్నంత వరకు తేదేపాలోనే కొనసాగుతానని టీడీపీ నేత‌ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా త‌న‌ను క్యాబినెట్ నుంచి తొలగించడంపై అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేత‌ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ రోజు మీడియాకు ప‌లు విష‌యాలు చెప్పారు.

క్యాబినెట్ విస్తరణ అనంతరం ఆనారోగ్యం కారణంగా తనను మంత్రి పదవి నుంచి తొలగించారనే ప్రచారం జరిగిందని, దీనికి మనస్థాపం చెంది తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని పేర్కొన్నారు.

I am withdrawing my resignation, I will continue in TDP till my last breath: Bojjala Gopalakrishna Reddy

అయితే, తాను ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశానుకానీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయ‌లేదని బొజ్జల వ్యాఖ్యానించారు. తన ఎమ్మెల్యే ప‌ద‌వికి చేసిన‌ రాజీనామాను కార్య‌క‌ర్త‌ల అభిప్రాయం మేర‌కు ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు చెప్పారు.

తాను ప్రాణమున్నంత వరకు తేదేపాలోనే కొనసాగుతానని గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచి రాజీనామాలు చేసిన స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు కూడా రాజీనామాలు వెన‌క్కి తీసుకోవాలని ఆయ‌న సూచించారు.

English summary
Chittor: Former Minister of Andhra Pradesh, TDP senior leader Bojjala Gopalakrishna Reddy on Saturday addressed the media said that he is taking back his resignation. While speculations rose that the party MLA quit over not being given ministry post in the Andhra Pradesh cabinet, Gopalakrishna Reddy clarified the situation stating that TDP party supremo and Chief Minister Chandrababu Naidu is more concerned about his health which is the reason behind him not given the Ministry. Stating that he will serve the party till his last breath. He requested his followers to withdraw their resignations also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X