వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేశ్‌ను పప్పు అని అనలేదు, కానీ సెర్చ్ చేస్తే మాత్రం వస్తోంది, వంశీ

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేస్తానని వల్లభనేని వంశీ స్పష్టంచేశారు. మరి మిగతా నేతల సంగతి ఏంటి ప్రశ్నించారు. బాపట్లలో ఓడిపోయిన అన్నం సతీశ్ కుమార్ ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారని గుర్తుచేశారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్ ఎమ్మెల్సీ పదవీకి ఎందుకు రాజీనామా చేయరని నిలదీశారు. నియమాలు, నిబంధనలు అందరికీ వర్తించవా అని ఫైరయ్యారు.

గెలవలేని దద్దమ్మ..

గెలవలేని దద్దమ్మ..


ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ తమకు నీతులు చెపుతారా అని వంశీ ప్రశ్నించారు. ప్రత్యక్షంగా గెలవలేనందుకే దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవీని లోకేశ్‌కు కట్టబెట్టారని విమర్శించారు. అంతేకాదు నాలుగు వెబ్ సైట్లు నడుపుతూ తమను భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. తమను కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని అడిగారు. ఎన్నికలు జరిగి ఆరు నెలలైనా తాము జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకొచ్చామా అని మీడియాముఖంగా ప్రస్తావించారు.

లోకేశ్ పప్పు..

లోకేశ్ పప్పు..

లోకేశ్‌ను పప్పు అని తాను అనలేదని వంశీ క్లారిటీ ఇచ్చారు. రాంగోపాల్ వర్మ ప్రస్తావించారని చెప్పారు. ఆయనను అడిగే ధైర్యం లేక.. తనపై నిందులు మోపుతున్నారని చెప్పారు. ఒకవేళ ఆయనను అంటే మళ్లీ సినిమా, పాటలు తీస్తారని భయంతో.. అనడం లేదో అని గుర్తుచేశారు. కానీ గూగుల్‌లో సెర్చ్ చేస్తే పప్పు అని కొడితే లోకేశ్ పేరు వస్తుందని.. నాలుగు రోజుల క్రితం తాను కూడా చూశానని చెప్పారు.

ఇదివరకు కూడా..

ఇదివరకు కూడా..

ఇప్పుడే కాదు రాజకీయాల్లోకి రాకముందే తనపై కేసులు ఉన్నాయని వంశీ వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు కేసులు ఉన్నాయే తప్ప.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యలకు సంబంధించిన కేసుల్లో అభియోగాలను ఎదుర్కొవడం లేదన్నారు. లేదంటే తాను ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోలేదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మానేద్దామా..

మానేద్దామా..

ఇటీవల కొందరు నేతలు రాజకీయాలు యావగింపుగా మారాయని అంటున్నారని వంశీ తెలిపారు. మరి రాజకీయాలు మానేద్దామా.. ఉద్యోగులకు బాధ్యతలు ఇద్దామా అని సవాల్ విసిరారు. చంద్రబాబుతో సహా అందరం రాజకీయాలకు దూరంగా ఉందామా అని అడిగారు. రాజకీయాల్లో ఉంటే ఓపిక ఉండాలని.. ప్రజా సేవ అని చెప్పారు. తనతోపాటు మిగతావారిని తయారు చేసింది చంద్రబాబు అని అంటున్నారు. మరి ఇంట్లో ఉన్న లోకేశ్ సంగతి ఏంటీ అడిగారు. ఆయనను ఎందుకు లీడర్ చేయడం లేదన్నారు. సమస్య ఎక్కడ ఉంది. జీన్స్ ప్రాబ్లమా ? లేదంటే డీఎన్ఏ సమస్య అని నిలదీశారు.

English summary
vamsi fire on lokesh. i didnot call lokesh pappu he clarify.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X