• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలీదు .. నాదెండ్ల షాకింగ్ కామెంట్

|
  జూ. ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాదెండ్ల | Nadendla Bhaskar Said That He Didn't Know Jr NTR

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత టీడీపీ ని చంద్రబాబు నడిపించలేకపోతున్నారని , కొత్త నాయకుడు అవసరం అని చర్చ జోరుగా సాగుతుంది. ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. ఇక ఇంత చర్చ జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలీదని నాదెండ్ల భాస్కర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

  సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్ పై సీఎం జగన్ సీరియస్ .. టీడీపీకి షాక్ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ

  ఏపీలో టీడీపీకి కష్టకాలం ... నైరాశ్యంలో తెలుగు తమ్ముళ్ళు

  ఏపీలో టీడీపీకి కష్టకాలం ... నైరాశ్యంలో తెలుగు తమ్ముళ్ళు

  గడచిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. ఇప్పటికే టీడీపీ ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. ఇక ప్రస్తుతం పార్టీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. రాష్ట్రంలో టీడీపీని బలహీనం చెయ్యటానికి బీజేపీ వలసలను ప్రోత్సహిస్తుంటే వైసీపీ టీడీపీ హయాంలో సాగిన అవినీతి బండారం బయట పెడతామని చెప్పి పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇక రాష్ట్రంలో టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులు , టీడీపీ టార్గెట్ గా సీఎం జగన్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల్లో అవినీతి బయటకు తీయాలనే నిర్ణయం వెరసి పార్టీ పరిస్థితి డోలాయమానంగా తయారైంది. ఇప్పుడిప్పుడే కోలుకునే యత్నం చేస్తున్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్తున్నారు. ఎవరూ బాధ పడొద్దని , ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండే పార్టీ తమదని ఆయన పార్టీ శ్రేణుల్లో కాస్త ధైర్యం నూరిపోస్తున్నారు. అయినా టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం వీడటం లేదు.

  టీడీపీకి కొత్త నాయకుడు కావాలనే చర్చ .. తెరపైకి జూనియర్ ఎన్టీఆర్ పేరు

  టీడీపీకి కొత్త నాయకుడు కావాలనే చర్చ .. తెరపైకి జూనియర్ ఎన్టీఆర్ పేరు

  ఇక ఇదే సమయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంటి వారు, ఇంకొందరు రాజకీయ నేతలు సైతం తెలుగుదేశం పార్టీ తిరిగి మనుగడ సాగించాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని అందరూ మర్చిపోతారని తిరిగి టీడీపీలో జవసత్వాలు నిండే ప్రయత్నం జరుగుతుంది అని జోరుగా చర్చ జరుగుతుంది . మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తారక్ అనే భావన వ్యక్తం అవుతుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టకపోతే తెలుగుదేశం పార్టీకి భ‌విష్య‌త్తు ఉండ‌దేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

  రాష్ట్రం అంతా ఎన్టీఆర్ ను జపిస్తుంటే ... అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలీదని షాకింగ్ కామెంట్ చేసిన నాదెండ్ల

  రాష్ట్రం అంతా ఎన్టీఆర్ ను జపిస్తుంటే ... అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలీదని షాకింగ్ కామెంట్ చేసిన నాదెండ్ల

  టీడీపీ సంక్షోభం నుంచి బయటపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాలనే వాదనలు బలంగానే వినిపిస్తున్న తరుణంలో ఈ అంశంపై నాదెండ్ల భాస్కర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వార్తలు తాను కూడా విన్నానన్న నాదెండ్ల.. అసలు తనకు జూనియర్ ఎన్టీఆర్ ఎవరో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. అంతేకాదు తాను సినిమాలు చూడనని చెప్పారు. అయినా ఈ విషయం పై ఎన్టీఆర్ కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల భాస్కర్ రావు పేర్కొన్నారు ఇక . జనసేన పార్టీ భవిష్యత్తుపై కూడా నాదెండ్ల భాస్కర్ రావు తనదైన రీతిలో స్పందించారు. జనసేన గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని ఇప్పుడు కూడా ఆ పార్టీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని వెల్లడించారు. తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరడం ఒక తప్పిదం అని పరోక్షంగా భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. అటు తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడం ఓ తప్పిదమని పరోక్షంగా ఆయన వ్యాఖ్యానించారు.

  English summary
  Nadendla Bhaskar Rao made interesting comments on this issue when he heard strongly that the Jr NTR entry was to be made to get out of the TDP crisis. Nadendla, who has heard similar news .. commented that he did not even know who is the junior NTR. He also said that he did not watch movies. But Nadendla Bhaskar Rao said NTR family members should take a decision on the matter
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X