పవన్‌తో పరిచయం లేదు, బాబు మనిషే: జగన్, ‘స్పీడ్ ఎక్కువ-ఫీడ్‌బ్యాక్ తక్కువ’

Subscribe to Oneindia Telugu
  Pawan Kalyan Tour: I Don't Know Pawan Kalyan Says YS Jagan

  అనంతపురం: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో తనకు పరిచయం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ ఎంటరౌతారని, చంద్రబాబును పవన్ విమర్శించరని జగన్ అన్నారు.

  రాజులే మారారు, దోపీడీ..: ఏపీ, తెలంగాణపై పవన్ ఫైర్, 'పరకాలకు గుణపాఠమే'

  ప్రత్యేక హోదాపై తనది, పవన్‌ది ఒకే మాటే అయినా పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు ప్రభావంలోనే ఉన్నారని, చంద్రబాబు ప్రభావం నుంచి పవన్ బయటకు రావాలని జగన్ అన్నారు.

  బాబు మోసం తెలుసుకుంటే మంచిది

  బాబు మోసం తెలుసుకుంటే మంచిది

  చంద్రబాబు మోసం, అన్యాయం చేస్తారనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదని జగన్ అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి పోటీచేసే అవకాశం ఉందన్న ప్రశ్నకు జగన్ సమాధానం చెబుతూ.. ఎవరు అధికారంలోకి రావాలన్నా ప్రజలు దీవించాలని, దేవుడు ఆశీర్వదించాలని జగన్ చెప్పారు. పాదయాత్ర చేస్తున్న జగన్ .. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పందించారు. కాగా, జగన్‌పై పవన్ తన విశాఖ పర్యటనలో విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.

  పవన్ వ్యాఖ్యల్లో తప్పులేదు

  పవన్ వ్యాఖ్యల్లో తప్పులేదు

  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం తప్పులేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. లాభాల బాటలో ఉన్నకంపెనీలను ప్రైవేట్ పరం చేయడం సరికాదని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని, దీన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని గంటా చెప్పారు. రాష్ట్రంలో ఏమైనా సమస్యలు ఉంటే పవనే కాదు.. ఎవరైనా పోరాటం చేయవచ్చునని మంత్రి అన్నారు. వీలైనంతవరకు ఏ సమస్యలు లేకుండా ప్రభుత్వం పరిష్కరిస్తుందని గంటా చెప్పారు.

  స్పీడ్ ఎక్కువ.. ఫీడ్ బ్యాక్ తక్కువ

  స్పీడ్ ఎక్కువ.. ఫీడ్ బ్యాక్ తక్కువ

  పవన్ కళ్యాణ్‌కు స్పీడ్ ఎక్కువ అని, అలాగే ఫీడ్ బ్యాక్ తక్కువ అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. సరైన విధంగా పూర్తి ఫీడ్ బ్యాక్ అందకనే పవన్ విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. పవన్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

  పవన్ మా శ్రేయోభిలాషి.. అన్యాయం జరగనివ్వం

  పవన్ మా శ్రేయోభిలాషి.. అన్యాయం జరగనివ్వం

  తమకెంతో సాయం చేసిన పవన్ కళ్యాణ్.. తమ శ్రేయోభిలాషేనని విష్ణుకుమార్ రాజు అన్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తమదేనని అన్నారు. కార్పొరేషన్ ప్రవేటీకరణను తాము అడ్డుకుంటామని, ఒకవేళ ప్రవైటీకరించినా.. ఉద్యోగులకు అందే ప్రయోజనాల్లో తేడాలేకుండా చూస్తామని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు ఉద్యోగులకు కల్పించేందుకు చర్యలు తీసుకునేలా తాము చూసుకుంటామని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSRCP president YS Jaganmohan Reddy on Wednesday said that he will not know Janasena President Pawan Kalyan personally.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X