వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పట్లో అలా, ఇంటర్ ఫస్టియర్ ఫెయిలయ్యా, సినిమాలపై ఆసక్తి లేదు, కానీ..: చంద్రబాబు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: తనకు పదహారేళ్ల వయసున్నప్పుడు అన్నింటిని చాలా తేలికగా తీసుకునేవాడినని, అందుకే.. ఇంటర్ ఫస్టియర్ ఫెయిలయ్యానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయ జీవితంలో నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన మాట్లాడారు.

ఆ తర్వాత తిరుపతి వెళ్లి చదువుకున్న తనకు అన్నీ విజయాలేనని చెప్పారు. విద్యార్థి దశలో తానెప్పుడూ సిగరెట్ తాగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో అవతలి బ్యాచ్‌తో గొడవ జరిగిన సందర్భాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

cm-chandrababu

ఆ సమయంలో అవతలి బ్యాచ్ వారిని చూసి తమ బ్యాచ్ వాళ్లు భయపడి పారిపోయారని, అయితే తాను వెళ్లి తమ బ్యాచ్‌ను ముందుకు నడిపించనని, దీంతో అవతలి బ్యాచ్ వాళ్లు పారిపోయారని తెలిపారు. ఈ సంఘటనతో తనపై కేసులు పెట్టారని, ఆ తర్వాత కొట్టేశారని చెప్పారు.

'హింస' అనే పదానికి తన జీవితంలో చోటులేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. విద్యార్థిగా ఉన్నప్పుడు చేసిన రాజకీయాలు.. మంత్రి, ముఖ్యమంత్రి అయ్యాక చేస్తే ఫ్యాక్షనిస్టులు అవుతారని, పదవిని అనుసరించి స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

సినిమాలు చూడటం మొదటి నుంచి తనకు అలవాటు లేదని, అయితే, 'బాహుబలి' సినిమా మాత్రం చూశానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఆ సినిమాను కుటుంబ సమేతంగా ఇంట్లోనే చూశానని, మల్టీప్లెక్స్ లకు వెళ్లి సినిమాలు చూసే అలవాటు తనకు లేదని చెప్పారు. అదే విధంగా, హోటల్ భోజనాలు చేసే అలవాటు కూడా తనకు లేదని, అయితే, విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రం తప్పదని అన్నారు.

English summary
AP CM Chandrababu Naidu recollected his student life memories once again. While giving an interview to a TV Channel on the occassion of completion of his 40 years political career he revealed many things and incidents. "When I am in my sixteens, I used to take everything in a lighter vein, I failed Intermediate First Year, later I went to Tirupati for further studies. Even I don't know the taste of Cigeratte in my student life" he added. "Even I don't watch movies, but I saw Bahubali along with my family members in my house, I don't even go to hotels, but when I am in other coutries, it is necessary.." Babu concluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X