• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ కేసు: మీతో విసిగిపోయాను.. ఇంకెంత కాలమిలా? లాయర్ పై సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం

By Ramesh Babu
|
  నా 30 ఏళ్ల సర్వీసులో జగన్‌ కేసుల లాంటివి ఎక్కడా చూడలేదు : న్యాయమూర్తి

  హైదరాబాద్: వైఎస్‌ జగన్‌ తరఫు న్యాయవాదిపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో శుక్రవారం జగన్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాలుగు చార్జిషీట్లపై డిశ్చార్జి పిటిషన్లను కలిపి విచారించాలని జగన్ తరపు న్యాయవాది కోరారు.

  ''టీడీపీకి చెమటలు, 98 శాతం వ్యతిరేకమే, జగన్ పడే కష్టంలో 5 శాతం పడినా.. అధికారం మనదే..''

  దీంతో.. ''రెండేళ్లుగా విచారణలో జాప్యం చేస్తున్నారు. మీ తీరుతో విసిగిపోయా! ఇంకెంత కాలం కోర్టు సమయాన్ని వృథా చేస్తారు? అనవసరమైన విషయాలతో రోజుల తరబడి వాదనలు వినిపిస్తున్నారు. నా 30 ఏళ్ల సర్వీసులో ఎక్కడా ఇలాంటి పరిస్థితిని చూడలేదు. ఇప్పటి వరకు కోర్టు సమయాన్ని వృథా చేసింది చాలు. ఇక నుంచి ఇలా కుదరదు..' అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

  ఆ చార్జిషీటును పక్కన పెట్టాలంటూ...

  ఆ చార్జిషీటును పక్కన పెట్టాలంటూ...

  సీబీఐ దాఖలు చేసిన సీసీ 9కేసు చార్జిషీటును పక్కన పెట్టాలంటూ జగన్‌, సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది తన వాదన వినిపించేందుకు సిద్ధమవుతుండగా... జగన్‌ తరఫు న్యాయవాది అశోక్‌ రెడ్డి కల్పించుకున్నారు. 8, 10, 14 చార్జిషీట్ల డిశ్చార్జ్‌ పిటిషన్లను కూడా కలిపి విచారించాలని ఆయన కోరారు. ఇందుకు అనుమతిస్తూ కోర్టు కూడా ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. అయితే దీనిపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో ఏముందో తనకు తెలుసని అంటూ వాదనలు వినిపించాలని సీబీఐ తరఫు స్పెషల్‌ పీపీ సురేందర్‌ను ఆదేశించారు.

  బెదిరించి పెట్టుబడులు పెట్టించారు...

  బెదిరించి పెట్టుబడులు పెట్టించారు...

  వైఎస్ జగన్‌, సాయిరెడ్డి కుమ్మక్కై అనేక కంపెనీలను ఏర్పాటు చేశారని, తీసుకోవాల్సిన లంచాలను పెట్టుబడుల రూపంలోకి మళ్లించారని సీబీఐ స్పెషల్‌ పీపీ సురేందర్‌ వాదించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా (ట్రబుల్‌ ఫ్రీ) వ్యాపారం చేసుకోవాలంటే పెట్టుబడులు పెట్టాల్సిందేనని సాయిరెడ్డి బెదిరించినట్లుగా ఓ సాక్షి న్యాయమూర్తి ఎదుట సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారని స్పెషల్‌ పీపీ తెలిపారు. ‘ఈ కేసును నిరూపించేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని... దశల వారీగా విచారిస్తే కుట్రను నిరూపించగలం. డిశ్చార్జ్‌ పిటిషన్లను కొట్టివేయండి..' అని సురేందర్‌ కోర్టును కోరారు.

  సాయిరెడ్డి పబ్లిక్‌ సర్వెంట్‌ కాదుగా...

  సాయిరెడ్డి పబ్లిక్‌ సర్వెంట్‌ కాదుగా...

  అయితే... సాయిరెడ్డి పబ్లిక్‌ సర్వెంట్‌ హోదాలోకి రారని, అందువల్ల కేసును విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందా? లేదా? అన్న దానిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి సీబీఐ లాయర్‌కు సూచించారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు. మరోవైపు వైఎస్ జగన్‌ కంపెనీల్లో రాంకీ ఫార్మా పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్‌లో దాఖలైన డిశ్చార్జ్‌ పిటిషన్లపై న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై తదుపరి వాదనలు 24న కొనసాగనున్నాయి.

  పాదయాత్రకు విరామం.. కోర్టులో ప్రత్యక్షం...

  పాదయాత్రకు విరామం.. కోర్టులో ప్రత్యక్షం...

  శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు నిమిత్తం హాజరుకావలసి ఉండడంతో వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో ‘ప్రజా సంకల్పం' పాదయాత్రకు విరామం ఇచ్చారు. జగన్ కోర్టుకు హాజరైన సందర్భంగా పెద్దసంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా కోర్టుకు తరలివచ్చారు. వారందరినీ బయటకు పంపేందుకు కోర్టు సిబ్బంది తంటాలుపడ్డారు. సాయంత్రం 4.30 వరకు జగన్‌ కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కొంతమంది వైసీపీ నాయకులు జగన్‌ను కలిసి కొద్దిసేపు చర్చించారు. చోటామోటా నాయకులు, కార్యకర్తలు కోర్టుకు రావడంపై జగన్‌ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

  English summary
  YCP Chief YS Jagan Mohan Reddy temporarily stopped his Prajasankalpa Yaatra and attended CBI Court here in Hyderabad on Friday. During the arguments in Jagan Case.. Judge fired on Jagan's advocate when he pleads to combine the discharge petitions with 4 chargesheets. While speaking with Jagan's advocate.. Judge of the CBI Special Court said " I fedup with you.. How long like this? You are wasting the valuable court time. I haven't seen this type of situation in my 30 years experience. You people are argueing with unnecessary issues".
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X