వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎల్ వైసీపీలో చేరితే అభ్యంతరం లేదు, అందుకే టిడిపిని వీడా: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: మాజీ మంత్రి డిఎల్. రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే తనకు అభ్యంతరం లేదని వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అభిప్రాయపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇటీవల కాలంలో ప్రకటించారు డీఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడ లేకపోలేదు. ఒకానొక సమయంలో డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ నేతలు కూడ కొందరు చర్చించారనే ప్రచారం కూడ సాగింది. ఈ సమయంలో రఘురామిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

కడప జిల్లాలో టిడిపి రాజకీయంగా వైసీపీపై ఆదిపత్యం సాధించేందుకు వీలుగా వ్యూహలను రచిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టిడిపిలో చేర్చుకోనేందుకు వ్యూహలు రచిస్తోంది.

గత ఏడాది కడప జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటించిన సందర్భంగా మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబును కలవడం రాజకీయంగా సంచలనం కల్గించింది. డీఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగింది.అయితే ఇంకా డీఎల్ రవీంద్రారెడ్డి తన నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదు. వైసీపీ నేతలు కూడ టిడిపితో టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ సమయంలో ఓ తెలుగు ఛానెల్‌కు రఘురామిరెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.

డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే అభ్యంతరం లేదు

డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే అభ్యంతరం లేదు


మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చెప్పారు. డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే తనకు అభ్యంతరం లేదని రఘురామిరెడ్డి ప్రకటించారు.

టిడిపిలో ప్రాధాన్యత లేకపోవడంతో వైసీపీలో చేరాను

టిడిపిలో ప్రాధాన్యత లేకపోవడంతో వైసీపీలో చేరాను


తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఉంటుందని రఘురామిరెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ టిడిపిని పార్టీని స్థాపించిన సమయంలో తాను టిడిపిలో చేరినట్టు రఘురామిరెడ్డి చెప్పారు. ప్రాంతీయ పార్టీల ద్వారానే అభివృద్ది సాధ్యమని భావించి ప్రొద్దుటూరు పంచాయితీ సభ్యుడిగా ఉన్న తాను ఆనాడు టిడిపిలో చేరినట్టు చెప్పారు.చాలా కాలం పాటు టిడిపిలో ఉన్నట్టు ఆయన చెప్పారు.

వైసీపీలో చేరడానికి దారి తీసిన పరిస్థితులు

వైసీపీలో చేరడానికి దారి తీసిన పరిస్థితులు

ఎన్టీఆర్ మరణం తర్వాత టిడిపిలో తనకు సరైన గుర్తింపు లేకుండా పోయిందని రఘురామిరెడ్డి చెప్పారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో పార్టీ నాయకత్వం కడప జిల్లాలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని రఘురామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో టిడిపిని వీడి వైసీపీలో చేరినట్టు రఘురామిరెడ్డి చెప్పారు.

టిడిపిలో చేరుతానని ప్రచారం

టిడిపిలో చేరుతానని ప్రచారం

తాను కూడ టిడిపిలో చేరుతానని ప్రచారం సాగుతోందని వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చెప్పారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన చెప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు కొందరు టిడిపి నేతలు తనతో సంప్రదింపులు జరిపారనే ప్రచారం సాగుతుందన్నారు.ఈ ప్రచారం ఎందుకు సాగుతోందనే విషయం తనకు తెలియదని రఘురామిరెడ్డి చెప్పారు. తనపై బురద చల్లేందుకే ఈ ప్రచారం సాగుతోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి వీరారెడ్డితో వైరం అందుకే

మాజీ మంత్రి వీరారెడ్డితో వైరం అందుకే

రాజకీయంగా తాను బలపడితే తనకు ప్రాధాన్యత తగ్గుతోందనే ఉద్దేశ్యంతో మాజీ మంత్రి వీరారెడ్డి ప్రయత్నించారని రఘురామిరెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ కారణంగానే తాను వీరారెడ్డితో విభేదించినట్టు రఘురామిరెడ్డి చెప్పారు. ఓ టర్మ్ తాను ఓటమి పాలు కావడానికి వీరారెడ్డి కూడ కారణమయ్యాడని రఘురామిరెడ్డి చెప్పారు. ఈ కారణంగానే తనకు వీరారెడ్డితో బేదాభిప్రాయాలు వచ్చాయని చెప్పారు.

జగన్ మాట తప్పడు

జగన్ మాట తప్పడు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మాట తప్పడని రఘురామిరెడ్డి అభిప్రాయపడ్డారు. తన స్థానంలో వేరొకరికి టిక్కెట్టు కేటాయించడని రఘురామిరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడ తాను ఘన విజయం సాధించనున్నట్టు రఘురామిరెడ్డి చెప్పారు. ఇచ్చిన మాట వెనక్కు తీసుకొనే చరిత్ర జగన్‌కు లేదని చెప్పారు.

English summary
ysrcp MLA Raghurami Reddy said that he is no objection to join in ysrcp former minister D.L. Ravindra Reddy .A Telugu channel interviewed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X