వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెడ్డపేరు తేను, అమ్మ కష్టాన్ని స్వయంగా చూశా: పవన్ కల్యాణ్‌కు లోకేష్ కౌంటర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: తాత, నాన్న మాదిరిగా పేరు తెచ్చుకొంటానో లేదో తెలియదు కానీ, వారి పేర్లకు తాను మాత్రం చెడ్డపేరు మాత్రం తీసుకురానని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. గురువారం నాడు అసెంబ్లీలో లోకేష్ ప్రసంగించారు. తన చిన్నతనంలోని పరిస్థితులను ఆయన గుర్తుకు చేసుకొన్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి నారా లోకేష్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు పరోక్షంగా అసెంబ్లీ వేదికగా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

రాత్రింబవళ్ళు చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ది కోసం కృషి చేస్తారని లోకేష్ చెప్పారు.1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్న కాలంలో తమ ఇంటి వద్ద ఎప్పుడూ కూడ సుమారు వెయ్యి మందికిపైగా కార్యకర్తలు ఉండేవారని లోకేష్ చెప్పారు.

ఆ సమయంలో తాము నివాసం ఉన్న ఇల్లు కూడ చాలా చిన్నగా ఉండేదని చెప్పారు. చిన్న రూమ్‌లోనే కేబినెట్ సమావేశం పెట్టుకొనేవారని పార్కింగ్ వద్దే ఐఎఎస్‌లతో సమావేశాలు నిర్వహించేవారని లోకేష్ గుర్తు చేసుకొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

ఎన్టీఆర్, బాబుకు చెడ్డపేరు తీసుకురాను

ఎన్టీఆర్, బాబుకు చెడ్డపేరు తీసుకురాను

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన ఎన్టీఆర్, చంద్రబాబులకు చెడ్డపేరు తెచ్చే విధంగా తాను ఏనాడూ వ్యవహరించబోనని ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. వారు తెచ్చుకొన్నంత పేరు వస్తోందో రాదో తెలియదు, కానీ , వారికొచ్చిన పేరును మాత్రం చెడగొట్టబోనని లోకేష్ చెప్పారు.

బ్రహ్మిణి శ్రీమంతం రోజున ఐదు నిమిషాలే ఉన్నారు

బ్రహ్మిణి శ్రీమంతం రోజున ఐదు నిమిషాలే ఉన్నారు

ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సతీమణి బ్రహ్మిణి సతీమణి శ్రీమంతం సందర్భంగా ఐదు నిమిషాలే మాత్రమే ఇంట్లో ఉన్నారని చెప్పారు. బ్రహ్మిణిని ఆశీర్వదించి వెళ్ళిపోయారని లోకేష్ గుర్తు చేసుకొన్నారు. కనీసం ఆ రోజు భోజనం కూడ చేయలేదని చెప్పారు. తుపాన్ కారణంగా విశాఖలో సహయక చర్యల కోసం కేంద్ర హోం మంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

62 ఏళ్ళ వయస్సులో పాదయాత్ర

62 ఏళ్ళ వయస్సులో పాదయాత్ర

62 ఏళ్ళ వయస్సులో అనంతపురంలో పాదయాత్ర సందర్భంగా మూడు రోజుల పాటు తాను కూడ పాదయాత్రలో ఉన్నానని ఆయన చెప్పారు. 62 ఏళ్ళలో కూడ 24 ఏళ్ళ యువకుడిగా కన్పిస్తారని లోకేష్ చెప్పారు.ఏనాడూ కూడ త్వరగా ఇంటికి రాలేదని లోకేష్ చెప్పారు.

అమ్మే నాన్న విజయంలో పాత్ర

అమ్మే నాన్న విజయంలో పాత్ర

నాన్న విజయంలో మా అమ్మ పాత్ర ఉందని ఏపీ మంత్రి లోకేష్ చెప్పారు. తన చిన్నతనంలో మా అమ్మ కష్టాలను తాను చూశానని లోకేష్ చెప్పారు. అయితే ప్రస్తుతం మేమిద్దరం ఇక్కడే ఉంటున్నామని చెప్పారు.

English summary
Nara Lokesh said that I never bring the bad name to NTR and Chandrababu Naidu. minister Lokesh address in the assembly on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X