• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంను చూడలేదు, సంక్రాంతి సంబురం లేదు: చంద్రబాబు

|

అమరావతిపై రోజుకో కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చి పబ్బం గడుపుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఫౌండేషన్ వీక్ అని, ఇన్ సైడర్ ట్రేడింగ్ అని కొత్త కొత్త కబుర్లు చెప్తున్నారని తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే స్టాక్ ఎక్స్చేంజీలో డైరెక్టర్లు ముందుగా సమాచారం ఇచ్చి షేర్లు కొనుగోలు చేయడం అని వివరించారు. స్టాక్ మార్కెట్‌కు రాజధాని భూములకు లింకు ఏంటి అని ప్రశ్నించారు. రాజధానిలో జగన్ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో సూటిగా సమాధానం చెప్పాలన్నారు. కానీ ఆ ఇంటికి రూ.42 కోట్లు ఖర్చు చేయిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

 ఏపీ పేకాటనా..? మూడు ముక్కలు చేసేందుకు, 70 వేల కోట్ల డేటా సెంటర్ వెనక్కి, చంద్రబాబు ధ్వజం ఏపీ పేకాటనా..? మూడు ముక్కలు చేసేందుకు, 70 వేల కోట్ల డేటా సెంటర్ వెనక్కి, చంద్రబాబు ధ్వజం

తలా తోక లేని..

తలా తోక లేని..

రాజధాని ప్రాంతంలో కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి పబ్బం గడుపుకుందామని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతి అందరికీ అందుబాటులో ఉంటుందని ఎంపిక చేశామని గుర్తుచేశారు. కుప్పంలో ఉన్నవారు బెంగళూరు. హైదరాబాద్, త్రివేండ్రం, చెన్నై వెళ్లేందుకు ఈజీ అవుతుందే తప్ప.. విశాఖపట్టణం కాదని చెప్పారు. 18 గంటల ప్రయాణం చేసి, వెయ్యి కిలోమీటర్లు పయనించి.. విశాఖ చేరిన సాధారణ పౌరుడు ఎక్కడ ఉండాలా అని ప్రశ్నించారు. తలా తోక లేని నిర్ణయం రాజధాని మార్పు అని కుండబద్దలు కొట్టారు.

40 ఏళ్ల జీవితంలో

40 ఏళ్ల జీవితంలో

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కానీ జగన్ లాంటి సీఎంను చూడలేదని విమర్శించారు. అది మన అదృష్టమో, దురదృష్టమో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రానికి పట్టిన గ్రహణం జగన్ అని విమర్శించారు. రాజధాని మార్పుపై వైసీపీ తప్ప అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఆప్ అన్నీ పార్టీలు సరికాదని తమ వైఖరి తెలియజేశాయని చెప్పారు.

ఎక్కడికి వెళ్లాలి..?

ఎక్కడికి వెళ్లాలి..?

రాజధానిలో పెట్టుబడి పెట్టాలని వచ్చే పారిశ్రామిక వేత్త ఎక్కడికి రావాలి, విశాఖ రావాలా ? అమరావతిలో ఉండాలా ? లేదంటే కర్నూలు వెళ్లాలా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ముంబై వెళితే పనులన్నీ చక్కబెట్టుకొవచ్చు. అదే ఏపీకి వస్తే సంగతేంటి అని అడిగారు. రాష్ట్రంలో 20 వేల మంది యువకులకు ఉద్యోగం ఇస్తానని చెబితే ఎయిర్‌పోర్ట్ వెళ్లీ మరీ శివనాడర్‌కు వీడ్కోలు పలికానని గుర్తుచేశారు. ముఖేశ్ అంబానీకి తిరుపతిలో డిన్నర్ ఇచ్చి, గౌరవించానని పేర్కొన్నారు.

అదానీ వద్దకు..

అదానీ వద్దకు..


అదానీ వద్దకు చాలా సార్లు వెళ్లానని చెప్పారు. లులు గ్రూపు కోసం కష్టపడ్డానని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉన్న సింగపూర్ కంపెనీని కూడా వెనక్కి పంపిన ఘనత జగన్‌కు దక్కుతుందని చంద్రబాబు చెప్పారు. సింగపూర్‌లో అవినీతి అంటే ఏంటో తెలియదని, పారదర్శకంగా ఉంటారని చెప్పారు. ట్యాక్సీ డ్రైవర్, హోటల్‌లో సర్వర్ కూడా టిప్పు తీసుకోరని గుర్తుచేశారు.

నో ఫెస్టివ్ మూడ్..

నో ఫెస్టివ్ మూడ్..

జగన్ చేసే చర్యల వల్ల హ్యపీ న్యూ ఇయర్ కూడా చెప్పుకొని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. రేపు సంక్రాంతి పండగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితి అని చెప్పారు. కులం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో ఏ కులం ఉందని అభివృద్ధి చేశానని చెప్పారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసింది, చరిత్రలో నిలిచిపోయేందుకు మాత్రమేనని చెప్పారు.

English summary
i never see cm like jagan mohan reddy chandrababu naidu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X