వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఆర్ జూన్ నుండి అమ‌లు : మ‌హిళా-, ఔట్ సోర్సింగ్‌- కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు వ‌రాలు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపి ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఉద్యోగుల పై వ‌రాల జ‌ల్లు కురిపించింది. కీల‌క‌మైన మ‌ధ్యంత‌ర భృతితో పాటుగాగా ప్ర‌త్యేకంగా మ‌హిళా ఉద్యోగులు..ఔట్ సోర్సింగ్ వారి విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. అదే విధంగా..కాంట్రాక్టు ఉపాధ్యాయులు, లెక్చరర్లకు టైమ్ స్కేల్ వ‌ర్తింప చేసేలా నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.

మ‌ధ్యంత‌ర భృతి జూన్ నుండి..
రాష్ట్ర ప్ర‌భుత్వ - ఉద్యోగుల‌కు ఏపి ప్ర‌భుత్వం మ‌ధ్యంత‌ర భృతి ప్ర‌క‌టించింది. ప్రభుత్వ ఉద్యోగుల వినతి మేరకు రా ష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్‌సీ నివేదిక ఇచ్చేందుకు ఇంకా సమయం పట్టనున్నందున.. ఉద్యో గులకు 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. 2018 జులై 1 నుంచి ఇది వర్తిసుంది. పెంచిన ఐఆర్‌ని వచ్చే జూన్‌ నుంచి ఉద్యోగులకు అమలు చేస్తారు. అయితే తాజాగా.. కాంట్రాక్ట్ ఉద్యో గులకు మినిమం టైం స్కేల్‌‌తో పాటు ఇతర సదుపాయాలు క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం క్యాబినెట్ లో నిర్ణ‌యం తీసు కుంది. మరీ ముఖ్యంగా 12 నెలల ప్రసూతి సెలవు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కూడా వరాలు జల్లు కురిపించింది.

I.R From June : many decisions for women and contract employees

ఔట్ సోర్సింగ్..కాంట్రాక్టు ఉపాధ్యాయుల‌కు..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వనున్నారు. ఇక‌, రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నతవిద్యలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు, లెక్చరర్లు... అదేవిధంగా ఇంటర్‌, కేజీబీవీ, యూనివర్సిటీలు, ఉన్నత పాఠశాలలు ఎక్కడ పనిచేసేవారైనా వారికి టైమ్‌ స్కేల్‌ వర్తింపచేయ‌నున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లకు ఒక్క పదిరోజులు మినహా 12నెలలు జీతాలు చెల్లించేందుకు, మెటర్నిటీ లీవ్‌ ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకరించింది. వారిని 60 ఏళ్లు వచ్చేవరకు ఉద్యోగం లో కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు, సహజమరణం అయితే రూ.2లక్షలు ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకరించింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులెవరైనా ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు, సహజ మరణమైతే రూ.2 లక్షలు చెల్లించాలని మంత్రివర్గం ఆమోదించింది. వీరందరికీ హెల్త్‌ కార్డులు అందిస్తాం. 1998, 2008 డీఎస్సీ నోటిఫికేషన్‌లలో ఎంపికై ఉద్యోగాల కోసం తిరుగుతున్నవారికి న్యాయం చేయాలని ... వారిలో ఇంకా ఉద్యోగాల్లో చేరకుండా ఖాళీగా ఉన్నారో గుర్తించి.. వారికి విద్యామిత్ర తదితర పోస్టులు ఇవ్వాల‌ని నిర్ణ యించారు.

English summary
AP Govt Announced IR for state Govt employees and pensioners. It implement from last july and payment from this year june. At the same time Ap Cabinet announced Special decisions for women-our outsourcing - contract employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X