వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రెడ్డి బంధువు ఇల్లు, ఆఫీసులపై ఐటి దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదాయం పన్ను శాఖ అధికారులు గురువారంనాడు మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు గవ్వ అమరేందర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. జిఎఆర్ కార్పోరేషన్ గ్రూప్ చైర్మన్ అయిన అమరేందర్ రెడ్డిని, ఆయన భార్య రేఖా రెడ్డిని ఐటి అధికారులు గురువారం రాత్రి పొద్దుపోయే వరకు విచారించారు.

స్థానిక ఐటి అధికారుల సహకారంలో ఢిల్లీలోని ఐటి శాఖ దర్యాప్తు విభాగం అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బెంగళూర్‌లోని ఆ దంపతుల ఆస్తులపై కూడా దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన జిఎఆర్ కార్ప్ గ్రూప్‌ను 1982లో స్థాపించారు. ఈ గ్రూప్ సంస్థలు వాణిజ్య, నివాస ఆస్తుల నిర్మాణం చేపడుతుంది. అమరేందర్ రెడ్డి, రేఖా రెడ్డితో పాటు ఎన్ శ్రీనివాస్ నెట్ నెట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వాములు లేదా డైరెక్టర్లని తెలుస్తోంది.

I-T sleuths swoop down on infra firm owner, wife

అతి తక్కువ ధరకు అమరేందర్ రెడ్డి ఇటీవల అత్యంత విలువైన హెచ్ఎండిఎ భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని వల్ల హెచ్ఎండిఎకు 140 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహాయం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

నందగిరి హిల్స్‌లోని హెచ్ఎండిఎ భూమికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతి తక్కువ ధర కట్టారని తెలంగాణ న్యాయవాది శ్రీరంగారావు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి ఇటీవల ఫిర్యాదు చేశారు.

English summary
Income tax sleuths on Thursday carried out raids on the offices and residence of G Amarender Reddy, founder and chairman of GAR Corp Group. Both Amarender and his wife Rekha Reddy were quizzed till late in the evening even as the searches continued till late in the night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X