• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నా 16 ప్రశ్నలకు 16 గంటల్లో సమాధానం కావాలి .. లేదంటే కోర్టుకు వెళతా ... వర్మ ఫైర్

|

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే . అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో నడిరోడ్డుపై మీడియా సమావేశం పెట్టనున్నట్టు వెల్లడించి కలకలం రేపిన వర్మను విజయవాడ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నారు.కాగా, రహదారులపై ప్రెస్ మీట్ కు అనుమతి లేని కారణంగా, పోలీసులు వర్మ ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. వివాదాస్పదుడైన వర్మ వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని భావించి ఆయనను తిరిగి హైదరాబాద్ పంపించివేసినట్టు పోలీసులు తెలిపారు.కానీ వర్మ మాత్రం ఈ వ్యవహారంపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తానేమైనా నేరస్తుడినా అని ప్రశ్నిస్తున్నారు.

తనను విజయవాడ నుంచి బలవంతంగా పంపించేయడంపై రామ్ గోపాల్ వర్మ మండిపడుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వస్తే ఏ కారణాలతో తనను హైదరాబాద్ తిప్పి పంపారో చెప్పాలని నిలదీస్తున్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వర్మ చంద్రబాబునాయుడు, విజయవాడ పోలీసులకు తాను 16 ప్రశ్నలు సంధిస్తున్నానని, వాటికి 16 గంటల్లోగా జవాబు చెప్పకపోతే కోర్టుకెళ్లి తన హక్కులు సాధించుకుంటానని హెచ్చరించారు.

I want the answers to my 16 questions in 16 hours or else i will go to court ... Varma Fired

ఈమేరకు తన 16 ప్రశ్నలను ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేసిన వర్మ దాని లింకును ట్విట్టర్ లో పెట్టారు. వర్మ సోషల్ మీడియా వేదికగా సంధించిన ప్రశ్నలు ఇవే

 1. ఎయిర్ పోర్ట్ నుండి హోటల్ కు వెళ్తున్న క్రమంలో పోలీసులు నా కారు ఎందుకు ఆపారు? నా కారు ఆపాల్సిన అవసరం ఏంటి?
 2. తమకు ఆదేశాలున్నాయని పోలీసులు అంటున్నారు, ఆ ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పాలి? వంటి ప్రశ్నలు తన పోస్టులో ప్రస్తావించారు.
 3. ఎయిర్ పోర్ట్ లో నన్ను 7 గంటలపాటు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా నిర్బంధించారు .నన్ను ఎవరూ కలవకుండా నేను బయటకు రాకుండా ఎందుకు చేశారో చెప్పండి?
 4. పత్రికా సమావేశానికి శాంతి భద్రతా సమస్య కారణంగా పోలీసులు చెప్తున్నారు. కాని నన్ను విజయవాడకు వెళ్లనివ్వకుండా, నన్ను గంటలపాటు నిర్బంధించి నన్ను తిరిగి వెళ్ళడానికి బలవంతం చేసినదానిపై పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు ఎందుకు ?
 5. నా స్నేహితులున్న చోట నా ప్రెస్ మీట్ ను ఎందుకు అడ్డుకున్నారు . నాకు వాక్ స్వాతంత్ర్యం లేదా ? అది నా హక్కు కాదా ?
 6. డీజీపీ తో, సీపీ తో మాట్లాడటానికి నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు ? వారెందుకు నిశ్శబ్దం వహించారు?
 7. నన్ను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు నన్ను అరెస్టు చేయడానికి తీసుకున్న నిర్ణయం ఎవరు తీసుకున్నారో నాకు చెప్పడానికి ఎందుకు తిరస్కరించారు?
 8. రాజకీయ యంత్రాంగాలు నడిపించే పోలీసు యంత్రాలుగా పని చేస్తున్నారా ?
 9. ఇది కేవలం కేర్ టేకర్ ప్రభుత్వం కావడంతో డి.జి.పి. మరియు సిపి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాల వివరణ ఇవ్వాలి ?
 10. ఇది ఒక వ్యక్తి యొక్క నిర్ణయమా లేక సమిష్టి నిర్ణయమా మరియు ఏ కారణాలపైనా అనేది చెప్పాలి ?
 11. పోలీస్ చర్య ఏకపక్షంగా మరియు విచిత్రమైనదిగా ఉండకూడదు . ముఖ్యంగా ప్రతి పోలీసు చర్య, ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరచబడిన వ్యక్తులు లేదా సమూహాల హక్కులు మరియు స్వేచ్ఛలను నిరోధించేలా ఉండరాదు . ఒకవేళ అలాంటి పక్షంలో స్పష్టంగా ఆ అంశంపై క్లారిటీ ఇవ్వాలి ?
 12. నన్ను ఆపే ఈ పోలీసు చర్య ఒక పాలనాపరమైన నిర్ణయమా ? తనవల్ల నిబంధనల , చట్టాల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? , అటువంటి తీవ్రమైన చర్యలు ఏకపక్షమైన ఉన్నత స్థాయి నిర్ణయాలు ఆధారంగా మాత్రమే ఉంటాయి. నా హక్కులు, స్వేచ్ఛకు భంగం కలిగించిన నిర్ణయం తీసుకున్న వారిని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకీ వారెవరు?
 13. డీజీపీ దీనిపై వివరణ ఇవ్వాలి. నన్ను అడ్డుకున్న నిర్ణయం ఆయనదా ? లేకా మరెవరి ప్రోద్బలం ఉందా అనేది చెప్పాలి ?
 14. పోలీస్ యంత్రాంగాలు స్పష్టంగా పక్షపాత , రాజకీయ, మరియు కేర్ టేకర్ ప్రభుత్వం ఆడమన్నట్టు ఆడుతున్నారా ?
 15. ఒక గదిలో ప్రెస్ మీట్ పెట్టుకోవటం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించాడు. అయినప్పటికీ ఆడుకోవటం పక్షపాత ధోరణికి నిదర్శనం కాదంటారా ?
 16. నా చివరి ప్రశ్న, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇది:
 17. ఒక ప్రజాస్వామ్య భారతదేశమా లేదా నియంతృత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా ? అంటూ తన 16 ప్రశ్నలను సంధించి 16 గంటల్లో సమాధానం కావాలని అడిగారు రాం గోపాల్ వర్మ.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ram Gopal Varma has been blaming AP government for sending him from Vijayawada. On Laxmi's NTR movie hetried to get a press meet but police send him to Hyderabad for security reasons . with this action Varma tweeted Chandrababu Naidu and Vijayawada police16 questions and asked to reply within 16 hours. otherwise he will go to the court for justice Varma tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more