అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

' ఎక్కడినుండైనా పోటీకి రెఢీ, మా వర్గం బలహీనం,'' ఫ్యాక్షన్‌ను జగన్ రెచ్చగొడుతున్నారు'

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం: జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని వైసీపీ నేత, గంగుల భానుమతి ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నానని భానుమతి చెప్పారు.

Recommended Video

YS Jagan padayatra : బీసీలకు అండగా ఉంటా, బాబు లా మోసం చెయ్యను !

పవన్ కళ్యాణ్‌తో పరిచయమే లేదు, చిరంజీవికి సలహ ఇచ్చా:పరిటాల రవిపవన్ కళ్యాణ్‌తో పరిచయమే లేదు, చిరంజీవికి సలహ ఇచ్చా:పరిటాల రవి

పరిటాల రవి కుటుంబంతో మద్దెల చెర్వు కుటుంబానికి విభేధాలున్నాయి. అయితే ఈ విభేధాల నేపథ్యంలో పలు హత్యలు జరిగాయి.అయితే కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న బానుమతి మరోసారి రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకొన్నారు.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో భానుమతి జగన్ ను కలిశారు. రాజకీయాల్లోకి క్రియాశీలకంగా పాల్గొనే విషయమై జగన్‌తో చర్చించారని సమాచారం.

జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీకి సిద్దం

జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీకి సిద్దం

జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీకీ సిద్దంగా ఉన్నానని వైసీపీ నేత గంగుల భానుమతి చెప్పారు.వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేకపోయానని, తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

 మా వర్గం బలహీనపడింది

మా వర్గం బలహీనపడింది

మద్దెల చెర్వు సూరి హత్య తర్వాత మా వర్గం బలహీనపడిందని భానుమతి అభిప్రాయపడ్డారు. ప్రత్యర్థులను హతమార్చాలనుకుంటే, అదేమీ తమకు పెద్ద సమస్య కాదని, ఫ్యాక్షనిజం, ప్రతీకార హత్యలకు చరమగీతం పాడామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారని భానుమతి ఆరోపించారు.

ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారు

ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారు

అనంతపురంలో ప్రశాంత వాతావరణాన్ని ప్రతిపక్షనేత జగన్‌ భగ్నం చేస్తున్నారని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. పరిటాల కుటుంబం ఎప్పుడూ ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించలేదన్నారు. జైలుకెళ్లి వచ్చినవారిని పక్కన పెట్టుకుని జగన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడించడం మంచిదికాదన్నారు.

జగన్ ఓర్వలేక పోతున్నారు.

జగన్ ఓర్వలేక పోతున్నారు.

జిల్లాకు హంద్రీనీవా ద్వారా నీరు రావడంతో రైతులు పంటలు పండించుకుంటూ ఆనందంగా ఉంటే జగన్‌ చూడలేకపోతున్నారన్నారు. జగన్‌కు, ఆయన కుటుంబానికి సీఎం కుర్చీ తప్ప మరో ధ్యాస లేదన్నారు. పాదయాత్ర అంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తూ చేసేది కాదని పరిటాల సునీత ఎద్దేవా చేశారు.

English summary
I will contest in any segment said Gangula Bhanumati on Wednesday at Anantapuram. Two days back she was met Ysrcp chief Ys Jagan in padayatra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X