వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019లో వెంకటగిరి నుండి పోటీ చేస్తా, ఏ పార్టీ నుండో తెలుసా?: నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: 2019 ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు రాంకుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు.

త్వరలోనే కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకొంటానని ఆయన ప్రకటించారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

I will contest from Venkatagiri segment in 2019 elections say Nedurumalli Ramkumar reddy

ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని రెండు నెలల్లో ప్రకటించనున్నట్టు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో రాంకుమార్ రెడ్డి ఉండేవాడు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరారు.

అయితే బిజెపిలో కూడ అంతగా క్రియాశీలకంగా రాం‌కుమార్ రెడ్డి లేరు.ఎన్నికలు దగ్గరపడుతున్నందున త్వరలోనే ఆయన ఏదో ఒక పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నారు. అయితే రాంకుమార్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

English summary
Former chief minister Nedurumalli Janardhana Reddy son Ramkumar Reddy said that he will contest from Venkatagiri Assembly segment in 2019 elections.he spoke to media on Monday at Nellore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X