వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ నుంచి లోకసభకు, అసెంబ్లీకి కూడా పోటీ: సబ్బం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత సబ్బం హరి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 15లోగా అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తాను విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి, మరో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సబ్బం హరి తెలిపారు. సిపిఎం పార్టీతో జై సమైక్యాంధ్ర పార్టీ పొత్తు ఖరారైనట్లు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఫలిస్తున్న పొన్నాల ప్రయత్నాలు

తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చేస్తున్న ఫలితాలు ఫలిస్తున్నాయి. పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్స్‌గా నామినేషన్ వేసిన వారు విరమించుకోవాలని పొన్నాల విజ్ఞప్తి చేశారు. పొన్నాల విజ్ఞప్తి మేరకు మెదక్ అసెంబ్లీ స్థానానికి రెబల్‌గా నామినేషన్ వేసిన శశిధర్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి రాగానే టికెట్లు రాని ఆశావాహులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11న టి మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు.

I Will contest from Visakhapatnam: Sabbam

125 నియోజక వర్గాల కసరత్తు పూర్తి: రఘువీరా

సీమాంధ్రలోని 125 నియోజక వర్గాల అసెంబ్లీ అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి చెప్పారు. కేంద్రమంత్రి చిరంజీవి నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

20 నుంచి 30 స్థానాలు మినహా మిగితా స్థానాలపై స్పష్టత వచ్చిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేయనున్నట్లు రఘువీరా తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ కానున్నట్లు రఘువీర చెప్పారు.

English summary
Jai Samaikyandhra Party leader Sabbam Hari on Thursday said that he Will contest from Visakhapatnam lok sabha seat and another assembly seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X