వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మరో 2 ఏళ్ళు నేనే, నన్నుతప్పిస్తేనే మీకు మంత్రిపదవులు'

ఈ రెండేళ్ళపాటు తాను మంత్రిగా ఉంటాను. నన్ను మంత్రిపదవి నుండి తొలగిస్తేనే మీకు మంత్రిపదవి వస్తోంది. వచ్చేసారి మంత్రిపదవులకోసం ప్రయత్నించండి ఆ సమయంలో నేను మీకు పోటీ రానంటూ ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాకినాడ: ఈ రెండేళ్ళపాటు తాను మంత్రిగా ఉంటాను. నన్ను మంత్రిపదవి నుండి తొలగిస్తేనే మీకు మంత్రిపదవి వస్తోంది. వచ్చేసారి మంత్రిపదవులకోసం ప్రయత్నించండి ఆ సమయంలో నేను మీకు పోటీ రానంటూ ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు చెప్పారు.

పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికలకు ముందుగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని తనకు కేటాయించాలని ఆయన కోరారు.అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు టిక్కెట్టును మరోసారి పునరుద్దరించే పరిస్థితి లేకపోయింది.అయినా ఆయన పార్టీ కోసం పనిచేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ నుండి కాపు సామాజికవర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పార్టీని వీడినా ఆయన పార్టీతోనే ఉన్నారు. కీలకసమయంలో ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను కూడ నిర్వహించారు.

పార్టీకి అన్ని సమయాల్లో వెన్నంటి ఉన్నారు. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు టిడిపి అధిక ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలు ఇచ్చేందుకుగాను డిప్యూటీసీఎం పదవిని నిమ్మకాయల చినరాజప్పకు కట్టబెట్టారు చంద్రబాబునాయుడు.

రెండేళ్ళపాటు తనకే మంత్రిపదవి

రెండేళ్ళపాటు తనకే మంత్రిపదవి

తనకే రెండేళ్ళపాటు మంత్రిపదవి ఉంటుందని ఏపీ డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో నే చినరాజప్ప ఈ విషయాన్ని ప్రకటించారని సమాచారం. ఈ రెండేళ్ళపాటు ప్రశాంతంగా ఉండాలని కూడ ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు.

అడక్కుండానే మంత్రిపదవి

అడక్కుండానే మంత్రిపదవి

ఎన్నికల్లో తాను విజయం సాధించిన తర్వాత అడక్కుండానే తనకు మంత్రి పదవిని ఇచ్చారని డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప అభిప్రాయపడ్డారు. మంత్రిపదవే కాదు ఉపముఖ్యమంత్రిని కూడ ఇచ్చి తనపై పెద్ద బాధ్యతను ఉంచారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో తన పదవిని మారుస్తారేమోనని టెన్షన్ పడ్డాను. కానీ, మార్చలేదని ఆయనే స్వయంగా తూర్పు ఎమ్మెల్యేలకు చెప్పారని పార్టీలో ప్రచారం సాగుతోంది.

వచ్చేసారి మంత్రిపదవి కోసం ట్రై చేయను

వచ్చేసారి మంత్రిపదవి కోసం ట్రై చేయను

వచ్చే దఫా తాను మంత్రిపదవికోసం ప్రయత్నించబోనని డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలతో అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ రెండేళ్ళపాటు తాను మంత్రిగానే ఉంటాను. వచ్చే దపా మాత్రం తాను మంత్రిపదవి కోసం ప్రయత్నించబోనని ఆయన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలతో అన్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. వచ్చే దఫా మీరు ప్రయత్నాలు చేస్తే తాను అడ్డుకోబోను అన్నట్టు పార్టీవర్గాల్లో ప్రచారం ఉంది.

ఇంకా పెద్ద పదవులు వద్దు

ఇంకా పెద్ద పదవులు వద్దు


మంత్రిపదవి, డిప్యూటీ సిఎం, హోంమంత్రి పదవిని తనకు కట్టబెట్టారని ఇంతకంటే గొప్ప పదవులు తనకు అవసరం లేదన్నారు చినరాజప్ప. ఈ పదవులు చాలని ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారని సమాచారం. తనను తొలగిస్తేనే మీకు మంత్రిపదవులు వస్తాయన్నారు. అయితే మంత్రివర్గపునర్వవ్యస్థీకరణలో తూర్పుగోదావరి జిల్లా నుండి జ్యోతుల నెహ్రుకు మంత్రి పదవి దక్కుతోందని భావించినా ఆయనకు దక్కలేదు.అయితే చినరాజప్ప అన్న మాటలతో జ్యోతుల నెహ్రు, తోట త్రిమూర్తులు సహ, ఇతర ఎమ్మెల్యేలు కూడ నవ్వారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

English summary
I will continues another 2 years in cabinet said Ap Deputy Chiefminister Nimmakayal Chinarajappa.He recently meeting with party MLA's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X