వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలుపైనా, ఓటమైనా , చావైనా, బతుకైనా వైసీపీతోనే: రోజా

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Venkaiah Naidu praises Roja - Oneindia Telugu

అమరావతి:నంద్యాల ఉపఎన్నిక ఫలితాల తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఈ మేరకు తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా ....ఆఖరి శ్వాస వరకూ జై జగన్ అంటూనే ఉంటా అంటూ రోజా పోస్ట్ పెట్టారు.

''ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న, శిల్పా గురించి తెలియకే జగన్ టిక్కెట్టు'' ''ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న, శిల్పా గురించి తెలియకే జగన్ టిక్కెట్టు''

నంద్యాల ఉపఎన్నిక ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా రావడానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా విపరీతమైన ప్రచారం కారణమనే ప్రచారం కూడ నెలకొంది.నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశకు కారణమైంది.

I will continues in Ysrcp till my last breath: Roja

నంద్యాల ఉపఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రోజా స్పందించలేదు. వైసీపీలో కిందిస్థాయి నేతలతో పాటు వైసీపీ చీఫ్ జగన్ కూడ ఈ ఫలితాలపై స్పందించారు. 'రోజా ఏమయింది? నంద్యాలలో టీడీపీ గెలుపు తర్వాత కనిపించకుండా పోయింది' అంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు ప్రశ్నించారు.

దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ పెట్టారు. ''గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా.. ఆఖరి శ్వాస వరకూ 'జై జగన్' అంటూనే ఉంటా!'' అంటూ రోజా స్పష్టం చేశారు.

''నాన్న ఆశయాలే శ్వాసగా బతికావు. నాన్నపై కుట్రలను సహించక దేశాన్ని శాసించే నియంత మెడలు వంచి, నమ్ముకున్న మా కోసం దమ్మున్న నాయకుడిగా నాన్న పేరుతో పార్టీ పెట్టావు. దొంగ హామీలు ఇవ్వలేదు. కుల రాజకీయాలు చేయలేదు.

వేరొకరి ప్రభతో వెలగాలనుకోలేదు. సింహంలా సింగిల్‌గా నిలిచావు. ప్రతి నిమిషం ప్రజల కోసం పోరాటం చేస్తున్నావు. జగనన్నా, నీ వెంటే మేముంటాము. ఈ పోరాటంలో మేము సైనికులమవుతాము!'' అంటూ జగన్‌కు ధైర్యాన్నిచ్చారు రోజా.

English summary
Ysrcp Mla Roja responded on Nandyal bypoll result. She posted a post on her social media network.I will continue in Ysrcp till my last breathe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X