అధికారం మాదే: బాలకృష్ణ, కుటుంబంతో (పిక్చర్స్)

అనంతపురం: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ఆ పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గానికి కుటుంబంతో సహ వచ్చిన ఆయన, నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ, ప్రజలు నిర్ణయిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సిద్ధమని బాలకృష్ణ వెల్లడించారు.

టిడిపి విజయం కోసం గట్టిగా కృషి చేస్తామని చెప్పారు. పార్టీ ప్రచారం కోసం ఎవరినీ బొట్టు పెట్టి పిలవడం జరగదని జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి బాలయ్య పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ ర్యాలీలా ఉందని బాలయ్య అన్నారు. వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు తరలిరావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

టిడిపిలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. హిందూపురంలో తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు బాలకృష్ణ బుధవారం ఉదయం స్థానిక సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో బాలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అభిమానులు, కార్యకర్తలు రోడ్ల మీదే కాకుండా భవనాలు, చెట్లపైకి ఎక్కి బాలయ్యకు అభివాదం చేశారు. బాలయ్యపై దారిపొడవునా అభిమానులు పూల వర్షం కూరిపించారు.

బాలకృష్ణకు స్వాగతం

బాలకృష్ణకు స్వాగతం

బాలకృష్ణకు పూలమాలలు వేసి స్వాగతం పలుకుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు.

బాలకృష్ణ అభివాదం

బాలకృష్ణ అభివాదం

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ఆ పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

బాలయ్య వెంట కదిలిని శ్రేణులు

బాలయ్య వెంట కదిలిని శ్రేణులు

బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గానికి రావడంతో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా కదిలిలాయి.

కుటుంబ సమేతం పూజలు

కుటుంబ సమేతం పూజలు

నామినేషన్ వేయడానికి ముందు బాలకృష్ణ బుధవారం ఉదయం స్థానిక సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో బాలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అభిమాన జనం

అభిమాన జనం

టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అభిమానులు, కార్యకర్తలు రోడ్ల మీదే కాకుండా భవనాలు, చెట్లపైకి ఎక్కి బాలయ్యకు అభివాదం చేశారు. బాలయ్యపై దారిపొడవునా అభిమానులు పూల వర్షం కూరిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+