అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఇలాంటోడని తెలిస్తే వేరేలా ఉండేవాడ్ని, ఎదురు తిరగండి.. తూటా పేలితే ముందుంటా: పవన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

మీ వల్ల నష్టపోతున్నాం: పవన్‌కు రైతుల ఝలక్

అమరావతి: బలవంతపు భూసేకరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. రైతులు ఇస్తేనే ప్రభుత్వం భూములు తీసుకోవాలని సూచించారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు భూములు ఇచ్చిన రైతులు నేటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకుంటే వారికి అండగా ఉండి పోరాటం చేస్తానని చెప్పారు.

అన్నీ తప్పే, అవి చెప్పరా: మోడీ ప్రభుత్వాన్ని హిందీలో ఏకేసిన రామ్మోహన్‌నాయుడుఅన్నీ తప్పే, అవి చెప్పరా: మోడీ ప్రభుత్వాన్ని హిందీలో ఏకేసిన రామ్మోహన్‌నాయుడు

గ్రామసభలు పెట్టి అందరి అనుమతితో భూములు తీసుకోవాలని సూచించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులకు అండగా నిలబడతానని చెప్పారు. ప్రభుత్వం బెదిరిస్తే ఎవరూ భయపడవద్దని, నేను అండగా ఉంటానని రైతులకు, గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. మరో బషీర్‌బాగ్ చేయాలనుకుంటే పోలీసుల తూటాకు ముందు నా గుండె చూపుతానని అన్నారు.

చంద్రబాబు ఇలా చేస్తారని తెలిస్తే నేను వేరేలా ఉండేవాడిని

చంద్రబాబు ఇలా చేస్తారని తెలిస్తే నేను వేరేలా ఉండేవాడిని

భూములను కొద్దిమంది చేతుల్లో పెట్టడాన్ని జనసేన వ్యతిరేకిస్తుందని పవన్ చెప్పారు. అవసరానికి మించి భూములు తీసుకోవద్దన్నారు. అసైన్డ్ భూములకూ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరానికి మించి రాజధాని కోసం భూసేకరణ జరుగుతోందన్నారు. భూసేకరణ చేస్తారని ఎన్నికలకు ముందు తెలిస్తే నేను వేరేలా ఉండేవాడినని పవన్ చెప్పారు. మద్దతిచ్చేవాడిని కాదన్నారు.

 ఎదురు తిరగండి, ప్రాణాలిచ్చేందుకు నేను ముందుంటా

ఎదురు తిరగండి, ప్రాణాలిచ్చేందుకు నేను ముందుంటా

అభివృద్ధికి వ్యతిరేకమని తెలిస్తే తాను టిడిపికి మద్దతు ఇచ్చి ఉండేవాడిని కాదని పవన్ అన్నారు. భూసేకరణ చేస్తే ఎదురు తిరగండని రైతులకు సూచించారు. భూసేకరణ జరిగితే చెప్పండని, మీతో కలిసి నేను కూడా ఆందోళన చేస్తానని చెప్పారు. భూములు లాక్కోవడానికి చూస్తే నేను ప్రాణాలు ఇచ్చేందుకు ముందు ఉంటానని తెలిపారు. అవసరానికి మించి భూమిని తీసుకుంటే జనసేన ముందుండి పోరాడుతుందన్నారు.

 పోలీసును నెగిటివ్‌గా చూడకండి, ప్రభుత్వం చెప్పింది చేస్తారు

పోలీసును నెగిటివ్‌గా చూడకండి, ప్రభుత్వం చెప్పింది చేస్తారు

పంట భూములను బీడు భూములుగా చూపడం సరికాదని పవన్ అన్నారు. పోలీసులను, అధికారులను మనం నెగిటివ్‌గా చూడవద్దని రైతులకు సూచించారు. వాళ్లు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేవారు మాత్రమే అన్నారు. కొందరి చావులు, ఏడుపులతో రాజధాని వద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. రైతుల అభివృద్ధికి అడ్డంకి కాదని, కానీ రైతులను ఏడిపించిన వారు నాశనం అవుతారన్నారు. భూములను నాశనం చేస్తే సర్వనాశనం అవుతారని మండిపడ్డారు.

 పోలీసుల తూటాలకు నా గుండె చూపుతా

పోలీసుల తూటాలకు నా గుండె చూపుతా

ప్రభుత్వాలు భూదాహాలను తగ్గించుకోవాలని పవన్ అన్నారు. సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లడాన్ని జనసేన సహించదని చెప్పారు. రాజ్యాంగం అందరికీ సమానమని, ఎవరూ.. ఎవరికీ బానిసలు కాదన్నారు. రైతులు వాళ్ల భూముల్లోకి రావడానికి ఆధార్ కార్డులను చూపించాలనడం దారుణం అన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని, అండగా ఉంటానని చెప్పారు. పోలీసుల తూటాకు ముందు నా గుండె చూపుతానని చెప్పారు. నేను మీకు రెండు మూడు గంటల దూరంలోనే ఉంటానని చెప్పారు. 'అమ్మా మీరు ప్రశాంతంగా నిదుర పోండి, మీకు అన్యాయం జరిగితే నేను వస్తాను, మహా అయితే 3-4 గంటల దూరంలో ఉంటాను' అని పవన్ అన్నారు.

విభజన నుంచి అవిశ్వాసం వరకు టీడీపీ రెండు నాల్కల ధోరణి

విభజన సమయం నుంచి అవిశ్వాస తీర్మానం వరకూ టీడీపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరించిందని పవన్ ట్విటర్లో విమర్శించారు. పద్దతి పాడు లేకుండా జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఏపీలోని యువతరంతో పాటు సాధారణ ప్రజానీకం ఆర్థికంగా, విద్యాపరంగా, పారిశ్రామికంగా వెనుకబడి పోయిందన్నారు. ఈ సమయంలో టీడీపీ నాయకత్వం ఏపీ ప్రజల పట్ల మరింత బాధ్యతగా వ్వవహరించాల్సి ఉందన్నారు. హోదా అంశంలో కేంద్ర వైఖరిని తిరుపతి బహిరంగసభ వేదికగా తాను నిరసించినపుడు టీడీపీ తరపున వినిపించిన వాదనలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఆయన ట్విటర్లో ఉంచారు.

English summary
I will face police bullets, Don't afraid at Chandrababu Naidu Government, says Jana Sena chief Pawan kalyan to Undavalli farmers on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X