వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును జైల్లో పెట్టేవరకూ పోరాడతా: సుప్రీంకోర్టుకైనా వెళ్తానంటూ లక్ష్మీపార్వతి

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును జైలుకు పంపే వరకూ తాను వదిలేది లేదని దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి, వైయస్సార్సీపీ నేత లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆస్తుల కేసుపై ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, ఏసీబీ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్తు వెళతానని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు. అంతేగాక, కేసు ఉపసంహరించుకోమని గతంలో చంద్రబాబు తనకు ఫోన్ చేసి ఒత్తిడి చేశాడని లక్ష్మీపార్వతి వెల్లడించారు.

I will fight till chandrababu will sent to jail: lakshmi parvathi

చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ 21​కి వాయిదా
1987 నుంచి 2005 మధ్య చంద్రబాబు భారీగా అక్రమాస్తులను పెంచుకున్నారని ఆరోపిస్తూ గతంలో వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుంచి పొందిన స్టే ఈ మధ్య వరకూ కొనసాగింది. అయితే పెండింగ్‌లో ఉన్న స్టేలు ఎత్తేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబు కేసుపై స్టే ఎత్తేశారు. దీంతో ఈ కేసు రెగ్యులర్‌ విచారణ కొనసాగుతోంది. అయితే కరోనా కారణంగా ఈ విచారణకు ఆటంకం కలిగింది.

కాగా, లక్ష్మీపార్వతి వేసిన పటిషిన్‌పై హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇవాళ వాదనలు విన్న న్యాయస్ధానం 21వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీపార్వతి పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబుపై స్టే వేకెట్ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు.

English summary
I will fight till chandrababu will sent to jail: lakshmi parvathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X